వీఆర్వో ఇంట్లో ఏసీబీ దాడులు.. స్పృహతప్పి పడిపోయిన వీఆర్వో

ఏసీబీ అధికారుల రాకను చూసి స్పృహ తప్పి పడిపోయిన రెవిన్యూ అధికారి !

Last Updated : Mar 3, 2018, 06:20 PM IST
వీఆర్వో ఇంట్లో ఏసీబీ దాడులు.. స్పృహతప్పి పడిపోయిన వీఆర్వో

విశాఖపట్నం జిల్లా మల్కాపురం వీఆర్వో సంజయ్ కుమార్, అర్బన్ వీఆర్వో వెంకటేశ్వరరావు, జీవీఎంసీ చైన్‌మెన్ నాగేశ్వరరావు నివాసాల్లో అవినీతి నిరోదకశాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళల్లోనే కాకుండా వారి సమీప బంధువుల నివాసాల్లోనూ సోదాలు కొనసాగాయి. అయితే, అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు తమ నివాసానికి వచ్చి సోదాలు నిర్వహించడం చూసి షాక్ కి గురైన వీఆర్వో సంజయ్ కుమార్ నివాసంలోనే స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తోంది. సంజయ్ కుమార్ పరిస్థితి గ్రహించిన కుటుంబసభ్యులు, ఏసీబీ అధికారుల అనుమతితో అతడిని ఆస్పత్రికి తరలించారు. 

విశాఖ జిల్లాకు చెందిన ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయని అందిన ఫిర్యాదు మేరకు, వారి నివాసాలతో పాటు వారి బంధువులు, సన్నిహితమిత్రుల నివాసాల్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు చేపట్టారు.

Trending News