Python Entry Into ACB Office At Vizag: అవినీతి కొండలను పట్టుకునే అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలోనే భారీ అనకొండ దూరింది. ఏసీబీ కార్యాలయంలో కొండ చిలువ దూరి హల్చల్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
TS News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అనిశాకు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పటికీ, అతడి నేరం రుజువు అయితే కుటుంబసభ్యుల అధీనంలోని ఆస్తుల్ని జప్తు చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
Afghanistan Cricket Board: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు దేశంలో మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు పట్టం కట్టారు. ముందుగా క్రికెట్‌పైనే దృష్టి సారించడం విశేషం.
రూ.1.10 కోట్ల లంచం కేసులో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju Committed Suicide) చేసుకున్నాడు. చంచల్ గూడ జైలులో ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju commits Suicide At Chanchalguda Central Jail) చేసుకోవడం కలకలం రేపుతోంది.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజే ఏసీబీకీ మరో భారీ తిమింగలం చిక్కింది. ఇటీవలనే కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి మరువకముందే.. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు.
తెలంగాణలో త్వరలోనే కొత్త రెవిన్యూ చట్టం రాబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ( TS Assembly session ) కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ (Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
Shaikpeta Tehsildar Sujatha | హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ భూ వివాదం కేసులో లంచం తీసుకున్నట్టుగా షేక్‌పేట తహశీల్దార్ సుజాత ఏసీబీ అధికారుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ( AJay Kumar Suicide) చేసుకున్నారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
తాను కొన్న భూమికి పట్టా చేయాలన్న దరఖాస్తు నాలుగేళ్లుగా అలాగే ఉండటంతో అధికారిని కలిశాడు ఆ రైతు. రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలు ఇచ్చుకుంటానని డీల్ కుదుర్చుకుని ఏసీబీకి పట్టించాడు.
గత రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లుగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది.
నగరంలో అక్రమ నిర్మాణాలపై అవినీతి నిరోదక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి ఇప్పటికే తనిఖీలు చేపట్టిన ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.