చంద్రబాబుకు వైఎస్ జగన్ విష్..వైరల్ గా మారిన ట్వీట్

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తన 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు

Updated: Apr 20, 2019, 04:07 PM IST
చంద్రబాబుకు వైఎస్ జగన్ విష్..వైరల్ గా మారిన ట్వీట్

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిక్ష నేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు చంద్రబాబు తన 69వ జన్మదినం సందర్భంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు హదయపూర్వక అభిందనలు అంటూ ట్వీట్ చేశారు జగన్ . రాజకీయంగా బద్ధశత్రువు ఉన్న జగన్ విష్ చేయడం గమనార్హం . ఈ నేపథ్యంలో జగన్ చేసిన ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ అవుతుతోంది. 

ఉదయం చంద్రబాబుకు ప్రధాని మోడీ విష్ చేసిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా  తమ అధినేత పుట్టిన రోజును శుభాకాంక్షలు తెలిపేందుకు నారా వారి ఇంటిని టీడీపీ నేతలు,  కార్యకర్తలు క్యూకడుతున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు  చంద్రబాబు బర్త్ డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు