Update on Avinashreddy Bail: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌పై ఇవాళ తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఇటీవల రెండ్రోజులపాటు హోరాహోరీగా సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చేది లేనిదీ ఇవాళ తేలిపోనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై ఇటీవలే హోరాహోరీగా వాదనలు జరిగాయి. తల్లి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. బెయిల్ పిటీషన్‌పై తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ఇవాళ్టి వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేశారు. వాస్తవానికి బెయిల్ పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టులో ఏప్రిల్ 17వ తేదీనే దాఖలు చేసినా..వెంటనే విచారణకు నోచుకోలేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో టీఎస్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ పిటీషన్ వేసే హక్కు ఉందని, పిటీషనర్ వాదనలు వినాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read: Dulquer Salmaan and Rana Daggubati: దుల్కర్ సల్మాన్, రానా కాంబోలో మల్టీస్టారర్
ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే 7 సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు సహకరిస్తున్నానని అవినాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల రెండ్రోజులపాటు అవినాష్ రెడ్డి బెయిల్ అంశంపై పెద్దఎత్తున వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి రాజకీయంగా బలవంతుడని చెబుతున్నప్పుడు వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. రక్తం మరకలు తుడిచినంత మాత్రాన ఎవిడెన్స్ టాంపరింగ్ కాదని కోర్టు స్పష్టం చేసింది. దాదాపు రెండ్రోజులు వాదనల విన్న తెలంగాణ హైకోర్టు ఇవాళ జరిగే విచారణ వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐను ఆదేశించింది. ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటుందా లేదా అనేది ఇవాళ్టి తెలంగాణ హైకోర్టు తీర్పులో వెల్లడి కానుంది.
Also Read: Margadarsi Issue: మార్గదర్శి కేసులో వేగం పెంచిన సీఐడీ, శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి