సీఏఏ, ఎన్నాఆర్సీలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ చట్టాలకు మా పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ లోక్‌సభ నాయకుడు మితున్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలు దేశంలోని మైనారిటీలలో అభద్రతను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌పిఆర్‌లో అడిగే సమాచారం గతానికి, ఇప్పుడున్న చట్టంలో భిన్నంగా ఉందని

Last Updated : Jan 30, 2020, 07:13 PM IST
సీఏఏ, ఎన్నాఆర్సీలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ చట్టాలకు మా పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ లోక్‌సభ నాయకుడు మితున్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలు దేశంలోని మైనారిటీలలో అభద్రతను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌పిఆర్‌లో అడిగే సమాచారం గతానికి, ఇప్పుడున్న చట్టంలో భిన్నంగా ఉందని, ఈ విషయాలన్నీ పార్లమెంటులో చర్చిస్తామని అన్నారు.

శుక్రవారం ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకమని, ఈ సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు.

కౌన్సిల్ రద్దు గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, కౌన్సిల్ తీర్మానాన్ని న్యాయ శాఖకు కాకుండా కేంద్ర హోం కార్యదర్శికి పంపుతామని, తర్వాత దాని ఆమోదం కోసం కేబినెట్‌కు చేరుకుంటుందని చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News