Viral Video: సీఐ నుంచి కాపాడండి- సీఎం జగన్ కు మహిళా కౌన్సిలర్ విన్నపం

YSRCP Councillor complaints to CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలోని వైసీపీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ ను స్థానిక సీఐ వేధింపులకు గురవుతుంది. అందుకు సంబంధించిన వీడియో రికార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. సీఐ నుంచి తనకు రక్షణ కావాలని సీఎం జగన్ కు ఆమె ఓ వీడియో ద్వారా విన్నవించుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 10:57 AM IST
Viral Video: సీఐ నుంచి కాపాడండి- సీఎం జగన్ కు మహిళా కౌన్సిలర్ విన్నపం

YSRCP Councillor complaints to CM Jagan: ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా మహిళా కౌన్సిలర్‌ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు కలకలం సృష్టించింది. వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ఆ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి ఆమె విన్నవించుకున్నారు.  

చీరాల ఐదో వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి భర్త నరసింహారావుకు పట్టణంలో బార్‌ అండ్‌ రెస్టారెంటు ఉంది. డిసెంబరు 31న రాత్రి 11.20 గంటలకు ఒకటో పట్టణ సీఐ రాజమోహన్‌ సిబ్బందితో సహా రెస్టారెంటులోకి వచ్చి.. తన భర్తను దుర్భాషలాడారని, ప్రాధేయపడినా వినకుండా దురుసుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. 

తన బార్ లోని సిబ్బందిని కొట్టడంతో పాటు తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. దీనిపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో ఈనెల 8న రాత్రి మరోసారి రెస్టారెంటుకు వచ్చి.. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించి, అక్కడ ఉన్న వారిని తరిమికొట్టారన్నారు. 

సీఐ రాజమోహన్ నుంచి బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ వీడియోలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్థానిక వైకాపా నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మరింత అగ్గి రాజేసింది. 

ఇదే విషయమై సదరు సీఐ రాజమోహన్‌ను వివరణ కోరగా.. నూతన సంవత్సరం రోజున బార్‌లోంచి కేకలు వినపడటం వల్ల తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని చెప్పారు. ఎవరిపైనా దాడి చేయలేదని, దూషించలేదని తెలిపారు. ఈ నెల 8న బార్‌లోకి వెళ్లలేదని.. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

Also Read: APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుంటే జరిమానా...క్లారిటీ ఇచ్చిన APSRTC..

Also Read: Ap Corona cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు... కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News