Anantha Babu Bail: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా కేవలం మూడ్రోజుల బెయిల్ మాత్రమే..
ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం ఏజెన్సీకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎట్టకేలకు రాజమండ్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది సాధారణ బెయిల్ కానేకాదు. షరతులతో కూడిన కేవలం మూడ్రోజులు వర్తించే బెయిల్. మొన్న అంటే ఆగస్టు 20న అనంతబాబు తల్లి మరణించారు. దాంతో తల్లి అంత్యక్రియల కోసం బెయిల్ దరఖాస్తు చేసుకోగా..రాజమండ్రి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఆగస్టు 25వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలి వెళ్లిపోవాలి.
ఈ మూడ్రోజులు ఎల్లవరం గ్రామంలోనే ఉండి తల్లి అంత్యక్రియలు జరిపించాలి. అనంతబాబు పక్కనే నిత్యం పోలీసులుండాలని కోర్టు షరతులు విధించింది. కేసు గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించకూడదని తెలిపింది.
అనంతబాబు కేసు నేపధ్యం
ఏపీలో సంచలనం రేకెత్తించిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడని కట్టు కథ అల్లి అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు అనంత బాబు. కానీ పోలీసుల విచారణలో నేరం అంగీకరించక తప్పలేదు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు తెలిపాడు. తానొక్కడినే అతన్నిహత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు దారితీసిన వ్యక్తిగత వ్యవహారాలు బయటకు వెల్లడించలేనివిగా తెలుస్తోంది. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా..విఫలమయ్యాడు.
Also read: Pawan Kalyan: పరిశ్రమలు పెట్టాలంటే కప్పం కట్టాలా..వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ధ్వజం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook