ఢిల్లీ: కేంద్రం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. బడ్జెట్ తమను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ వల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కొత్త రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. దీంతో ఏపికి సహాయం చేస్తామని ఇచ్చిన హామిని కేంద్రం నిలబెట్టుకోలేకపోయిందని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. లోక్ సభలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంట్ వెలుపల విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో మెట్రోరైలు ప్రాజెక్టులను పరుగులెత్తిస్తున్నామని కేంద్రం చేసిన ప్రకటనను విజయసాయి రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రోలు ఇంకా ప్రారంభోత్సవానికే నోచుకోలేదని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ఏడాదికి రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ కలిగిన 3 కోట్ల మంది రీటేల్ ట్రేడర్స్‌కి ప్రధాన మంత్రి కరం యోగి మాన్ ధన్ పథకం కింద పెన్షన్స్ అందిస్తామని ప్రకటించడం అభినందించదగిన విషయం అని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.