Srikakulam Politics: జగన్‌ దెబ్బకు.. సిక్కోలు లీడర్లు పరేషాన్‌!

Srikakulam Politics: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ ప్రక్షాళనకు సిద్దమయ్యారా..! ప్రజల్లో లేని నేతలను పక్కనా పెట్టేయాలని డిసైడ్‌ అయ్యారా..! ఈ ప్రక్షాళన సిక్కోలు నుంచి ప్రారంభం అయ్యిందా..! సిక్కోలులో ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను మార్చిన అధినేత జగన్‌.. మిగతా చోట్ల కూడా ఇంచార్జ్‌ల మార్పు తప్పదని హెచ్చరించాలని అనుకుంటున్నారా..!

Written by - G Shekhar | Last Updated : Dec 10, 2024, 06:00 PM IST
Srikakulam Politics: జగన్‌ దెబ్బకు.. సిక్కోలు లీడర్లు పరేషాన్‌!

Srikakulam Politics: ఆంధ్రప్రధేశ్‌లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న వైఎస్‌ జగన్‌.. ఆ దిశగా పార్టీలో మార్పులు చేర్పులకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఈనెలలోనే జిల్లాల పర్యటనకు వస్తున్నారని.. నేతలంతా తన పర్యటనకు సిద్దంగా ఉండాలని హితబోధ చేస్తున్నారు. తాజాగా సిక్కోలు జిల్లా నేతలతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. కొందరు నేతల్నీ తీరు మార్చుకోవాలని సున్నితంగా  హెచ్చరించినట్టు తెలిసింది. అటు ప్రజల్లో తిరగని నేతలపై వేటు తప్పదని హెచ్చరించినట్టు సమాచారం. అయితే పార్టీ అధినేత నుంచి ఊహించని పరిణామంతో ఎవరిపై వేటు పడుతుందోనని శ్రీకాకుళం జిల్లా నేతలు టెన్షన్‌ పడుతున్నట్టు తెలుస్తోంది..

రెండురోజుల క్రితం సిక్కోలు జిల్లా నేతలకు వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు ఈ భేటీలో నేతలకు భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం సిక్కోలు జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన ప్రసాద్‌ కొనసాగుతున్నారు. అటు పార్లమెంటు పరిశీలకులుగా తమ్మినేని సీతారామ్‌ ఉన్నారు.  మరో మాజీమంత్రి సీదిరి అప్పలరాజుకు రాష్ట్ర డాక్టర్‌ విభాగం ఇంచార్జ్‌ బాధ్యతలు వహిస్తున్నారు. అయితే ధర్మాన కృష్ణదాస్‌ను మార్చేసి.. ఆయన సోదరుడు ప్రసాద రావుకు బాధ్యతలు అప్పగించాలని భావించారట. అలాగే గ్రామాగ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అటు నియోజకవర్గాల్లో ఎవరెవరు యాక్టివ్‌గా ఉన్నారు.. ప్రజలకు అందుబాటులో లేని నేతలెవరు అని సమాచారం తీసుకున్నారట. అయితే ప్రజలకు అందుబాటులోని లేని నేతలపై వేటు తప్పదని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరాంధ్ర నుంచే కూటమి సర్కార్‌పై ప్రజా పోరాటానికి వైఎస్‌ జగన్‌ సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో వైసీపీకి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం 34 సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో పార్టీని ప్రక్షాళన చేయాలని వైఎస్‌ జగన్‌ డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. తాజాగా టెక్కలి, అముదాల వలసలో పాత ఇంచార్జ్‌లకు ఉద్వాసన పలికిన వైఎస్ జగన్‌... టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించి.. అక్కడ పేరాడ తిలక్‌కు ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. పేరాడ తిలక్‌ అయితేనే టెక్కలిలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని అంచనా వేస్తున్నారట. మరోవైపు అముదాలవలసలోనూ వైసీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారామ్‌ను తప్పించారు. అక్కడ చింతడా రవికుమార్‌కు ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు చోట్లు ఇంచార్జ్‌ల మార్పు తర్వాత.. తదుపరి వేటు ఎవరిపై పడుతుందోనని నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.

మొత్తంగా పార్టీలో యాక్టివ్‌ లేని ధర్మాన ప్రసాదరావు, సాయిరాజ్‌ దంపతులను పక్కన పెట్టాలని నిర్ణయించారట. కొద్దిరోజులుగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు ఆశించినా స్థాయిలో రాణించడం లేదు.. ఈ నేపథ్యంలో వారి స్థానంలో కూడా కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. మొత్తంగా పార్టీ ఇంచార్జ్‌ల మార్పుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధినేత డిసైడ్‌ అయ్యారట. దాంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో.. ఎవరిని మారుస్తారో అని వైసీపీ లీడర్లు టెన్షన్‌ పడుతున్నట్టు తెలిసింది.

Also Read: BRS Politics: గులాబీ పార్టీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే! 

Also Read: Telangana: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News