7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై క్లారిటీ..!

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ గణంకాలు వచ్చేశాయి. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌ గణాంకాల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. డీఏ ఎంత మేరకు పెరగనుందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 07:42 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై క్లారిటీ..!

7th Pay Commission DA Hike: దేశంలో 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో శుభవార్త అందనుంది. డీఏ రూపంలో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందివ్వనుంది. నవంబర్ నెలకు సంబంధించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (ఏఐసీపీఐ) గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక డిసెంబర్ నెల గణాంకాలు మాత్రమే రావాల్సి ఉంది. జూలై నుంచి నవంబరు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే.. కేంద్ర ఉద్యోగులకు వచ్చే డీఏ పెంపు ఎంత అనేది స్పష్టమవుతోంది.

ఎలాంటి మార్పు లేదు

డిసెంబర్ 31న నవంబర్‌కు సంబంధించిన గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌ గణాంకాల్లో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్‌లో ఈ సంఖ్య 1.2 పాయింట్ల పెరుగుదలతో 132.5 స్థాయికి చేరుకుంది. ఇప్పుడు నవంబర్‌లో కూడా ఈ సంఖ్య 132.5గా ఉంది. జనవరి 1 నుంచి ఉద్యోగుల డీఏలో 4 శాతం పెంపు ఉంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో స్పష్టమైంది. అయితే ఈ పెంపును ప్రభుత్వం మార్చిలో ప్రకటించనుంది.

సెప్టెంబర్‌లో 131.3 పాయింట్ల వద్ద..

అక్టోబర్‌లో కూడా ఏఐసీపీఐ సూచిక 132.5 పాయింట్ల వద్ద ఉంది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 131.3 పాయింట్లు. ఆగస్టులో ఈ సంఖ్య 130.2 పాయింట్లు. జూలై నుంచి ఇందులో స్థిరమైన పెరుగుదల ఉంది. అక్టోబర్ తర్వాత నవంబర్‌లోనే స్తబ్ధత కనిపించింది. ఏఐసీపీఐలో నిరంతర పెరుగుదల కారణంగా 65 లక్షల మంది ఉద్యోగులకు కొత్త సంవత్సరం జనవరిలో డీఏ పెంపునకు మార్గం సుగమమైంది.

ఎంత పెరగనుంది..?

జూలైలో డీఏను 4 శాతం పెంచిన తర్వాత కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి పెరిగింది. ఇప్పుడు మళ్లీ 4 శాతం పెంచే అవకాశాలు ఉండడంతో 42 శాతానికి పెరగనుంది. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల జీతంలో భారీగా పెరుగుదల ఉంటుంది. 7వ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగుల డీఏను ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న సంగతి మీకు తెలిసిందే. జనవరి 2023 నాటి డీఏను కేంద్రం ప్రకటించబోతుంది. 

డేటాను ఎవరు విడుదల చేస్తారు..?

ఏఐసీపీఐ ఇండెక్స్‌ ఆధారంగా డియర్‌నెస్‌ అలవెన్స్‌లో ఎంతమేరకు పెంపుదల ఉండాలనేది నిర్ణయిస్తారు. ప్రతి నెలా చివరి పనిదినం నాడు కార్మిక మంత్రిత్వ శాఖ ఏఐసీపీఐ డేటాను విడుదల చేస్తోంది.  

Also Read: Ysr Pension Kanuka: ఏపీలో ఇవాళ్టి నుంచి పెంచిన పింఛన్లు, 64 లక్షలమందికి పింఛన్లు

Also Read: 'పంత్'ను గుర్తుపట్టలేదు.. చూడగానే చనిపోయాడనుకున్నా కానీ అమ్మకి ఫోన్ చేయమన్నాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News