DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో మరోసారి డీఏ పెంపు

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో డీఏ పెరగనుందని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగుల కరవుభత్యం 42 శాతానికి చేరుకోనుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2023, 03:12 PM IST
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో మరోసారి డీఏ పెంపు

దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యాగాలకు డిమాండ్ ఎక్కువ. ప్రయోజనాలు ఎక్కువ. ఎప్పటికప్పుడు డీఏ, టీఏ వంటివి పెరుగుతుంటాయి. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుందని సమాచారం. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది. 

రాబడిని పరిగణలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. ఇప్పుడు పెంచనున్న డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లో రానుంది. గత ఏడాది అంటే చివరిసారిగా సెప్టెంబర్ 28వ తేదీ 2022న డీఏ పెరిగింది. జూలై 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 

డీఏను ఎలా లెక్కిస్తారు

బేసిక్ శాలరీని బట్టి కరవుభత్యం లెక్క ఉంటుంది. ఏఐసీపీఐ సూచీని దీనికోసం ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చివరి 12 నెలల ఏఐసీపీఐ ప్రకారం చెల్లిస్తారు. పబ్లిక్ సెక్టార్ అయితే చివరి మూడు నెలల ఏఐసీపీఐ ప్రకారమిస్తారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏ అనేది చెల్లిస్తుంటుంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తించే ఈ డీఏను 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండుసార్లు పెంచుతారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత ఉద్యోగులతో పోలిస్తే అర్బన్ ప్రాంతీయులకు ఎక్కువ డీఏ లభిస్తుంది.

Also read: Adani Group: అదానీ గ్రూప్‌ను ముంచేసిన హిండెన్‌బర్గ్ ఎలా సంపాదిస్తుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News