Amazon Smartwatch offers: స్మార్ట్‌వాచ్‌లపై బారీ డిస్కౌంట్లు, బోట్ స్మార్ట్‌వాచ్ కేవలం 797 రూపాయలకే

Amazon Smartwatch offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆఫర్ నడుస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలనుకుంటుంటే ఇదే మంచి అవకాశం. స్మార్ట్‌వాచ్‌లపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 6, 2023, 08:15 PM IST
Amazon Smartwatch offers: స్మార్ట్‌వాచ్‌లపై బారీ డిస్కౌంట్లు, బోట్ స్మార్ట్‌వాచ్ కేవలం 797 రూపాయలకే

Amazon Smartwatch offers: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై బారీ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. మిగిలిన ఉత్పత్తుల సంగతేమో గానీ స్మార్ట్‌వాచ్‌లు కొనాలంటే మాత్రం సరైన సమయమిదే. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో భారీగా ఆఫర్లు ఉన్నాయి. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

ఆగస్టు 4వ తేదీన ప్రారంభమైన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 68 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 4.6 సెంటీమీటర్ల స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు కేవలం 13,899 రూపాయలకే లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు 667 రూపాయల వాయిదా పడుతుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో 1389 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు.

క్రాస్ బీట్స్ ఆర్బిట్ ఇన్ఫినిటీ 2.0 స్మార్ట్‌వాచ్‌పై కూడా 67 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో సూపర్ రెటీనా ఎమోల్డ్ డిస్‌ప్లే ప్రత్యేకత.  1.43 అంగుళాల స్క్రీన్, 4 జీబీ మెమరీ ఉంటాయి.  1000వరకూ పాటలు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాచ్ కేవలం 4,997 రూపాయలు.

బీట్ ఎక్స్‌పి స్మార్ట్‌వాచ్‌పై అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో ఏకంగా 82 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 1997 రూపాయలకే లభిస్తోంది. 1.43 అంగుళాల రౌండ్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఈ వాచ్ సొంతం. బ్లూ టూత్ కాలింగ్, రియల్ టైమ్ మోనిటరింగ్ ఫీచర్లు ఉంటాయి.

ఇక మరో బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 బ్లూటూత్. దీనిపై 50 శాతం డిస్కౌంట్ తరువాత 4,497 రూపాయలకు లభిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో 500 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే బ్యాటరీ బ్యాకప్. కేవలం 2 గంటలు చార్జింగ్‌తో 7 రోజుల వరకూ పనిచేస్తుంది. ఈ వాచ్‌లో 1.96 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 

మరో బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ బోట్. ఇది 1.83 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. 81 శాతం డిస్కౌంట్ అనంతరం కవలం 1297 రూపాయలకే లబిస్తుంది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మరో 500 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ స్మార్ట్‌వాచ్ మీకు కేవలం 797 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుత అవకాశం. 

Also read: Amazon Great Freedom Sale 2023: 50 అంగుళాల రూ.83,000 టీవీ కేవలం రూ.17499లకే..ఇప్పుడే కొనండి..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News