Amazon LG Window AC: అమెజాన్ బంపర్ ఆఫర్.. LG విండో ఏసీపై 51 శాతం డిస్కౌంట్!

Amazon LG Window AC: ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే సమ్మర్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. సమ్మర్ అప్లయెన్సెస్ పై ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. LG కంపెనీకి చెందిన 4 స్టార్ డ్యుయల్ ఇన్వర్టర్ విండో ఏసీపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 09:56 AM IST
    • సమ్మర్ అప్లయెన్సెస్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్స్
    • LG 4 స్టార్ విండో ఏసీపై 51 శాతం డిస్కౌంట్!
    • రూ.60,990 విలువైన ఏసీని రూ.29,990 అమ్మకం
Amazon LG Window AC: అమెజాన్ బంపర్ ఆఫర్.. LG విండో ఏసీపై 51 శాతం డిస్కౌంట్!

Amazon LG Window AC: ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని వాతవరణ శాఖ ఇటీవలే ఓ ప్రకటన చేసింది. మరోవైపు ఇప్పటికే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే వేసవి కాలంలో వడగాలులు కూడా గతంతో పోలిస్తే తీవ్రతరం కానున్నాయి. వీటి నుంచి మనల్ని మనం సంరక్షించుకునేందుకు ఎయిర్ కండిషన్ లేదా ఎయిర్ కూలర్ కొనేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతారు. 

ఈ విధంగా సమ్మర్ అప్లెయెన్సెస్ కు మంచి గిరాకీ పెరగనుంది. అయితే ఈ క్రమంలో ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. LG కంపెనీకి చెందిన 1.5 టన్ 4 స్టార్ డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీపై భారీ తగ్గింపును ప్రకటించింది. 

LG 1.5 Ton DUAL Inverter Window AC ఆఫర్ల్స్

LG డ్యుయల్ ఇన్వర్టర్ విండో ఏసీపై అమెజాన్ వైబ్ సైట్ లో ప్రత్యేక డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. మార్కెట్లో రూ. 60,990 విలువైన ఈ విండో ఏసీపై అమెజాన్ 51 శాతం డిస్కౌంట్ తో అందిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత దీని ధర రూ. 29,990 వద్దకు చేరుతుంది. 

ఈ కొనుగోలుపై HDFC, Kotak, HSBC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను యూజ్ చేయడం వల్ల 10 శాతం డిస్కౌంట్.. అనగా అత్యధికంగా రూ. 1,750 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత LG విండో ఏసీ ధర రూ. 28,240కు చేరుతుంది. దీంతో పాటు మీ పాత అప్లెయెన్సెస్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 5,360 వరకు ఆదా చేసుకోవచ్చు. దీని వల్ల LG విండో ఏసీని రూ. 22,880 ధరకు కొనుగోలు చేయవచ్చు.   

Also Read: Vivo T1 5G Flipkart: రూ.190 లకే Vivo 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి!

Also Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News