Ayushman Bharat Scheme Latest News: ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం కింద బీమా రక్షణను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా మహిళలకు ఈ కవరేజీ రూ.15 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో నాలుగు లక్షల పడకలను పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. రూ.10 లక్షలకు పెంచితే కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా మరో రూ.12,076 కోట్ల భారం పడనుంది.
బీమా పెంచితే.. మరింత ఎక్కువ మంది ఆయూష్మా భారత్ స్కీమ్ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు చెందిన 12.34 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందుతోంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు 7.37 కోట్ల మంది ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందుకోసం మొత్తం రూ.లక్ష కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ పథకంలోకి 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది.
లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలను క్రమంగా 4 లక్షలకు పెంచనుంది. ప్రస్తుతం దాదాపు 7.22 లక్షల ప్రైవేట్ హాస్పిటల్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2026-27 నాటికి 9.32 లక్షలకు, 2028-29 నాటికి 11.12 లక్షలకు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికి జన్ ఔషధి కేంద్రాలను కూడా 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని భావిస్తోంది. ఈ కేంద్రాల్లో నాణ్యమైన మందులు తక్కువ ధరకే కేంద్రం అందిస్తోంది.
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.