Best SIP Plans: నెలకు 5400 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం ఖాయం

Best SIP Plans: ఆర్ధికంగా పటిష్ఠంగా ఉండాలని, లక్షలు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అందుకు తగిన మార్గాలు ఎంచుకోవడంలోనే కలలు సాకారం కావడం, కాకపోవడం ఉంటుంది. దీనికోసం అద్భుతమైంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపీ. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2024, 06:53 AM IST
Best SIP Plans: నెలకు 5400 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం ఖాయం

Best SIP Plans: సరైన ఎస్ఐపీని ఎంచుకుని క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే లక్షాధికారి కావాలనే కల నెరవేరుతుంది. ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ పోతే 1 కోటి రూపాయలు సులభంగానే సేవ్ చేయవచ్చంటున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 5400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా SIP అనేది నిర్ణీత కాల వ్యవధుల్లో నిర్దిష్ట నగదు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే విధానం. నెలకు, వారానికి లేదా రోజూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్టర్లకు ఇది చాలా ఉపయోగకరం.  సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా క్రమంగా పెంచవచ్చు. ఎస్ఐపీ ద్వారా కోటి రూపాయలు సంపాదించడం ఎలాగో సులభమైన ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు నెలకు 5400 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం వార్షిక వడ్డీ లెక్కన 20 ఏళ్లకు 49.6 లక్షలు అవుతుంది. ప్రతి ఏటా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను 5 శాతం చొప్పున పెంచుకుంటే రెండో ఏడాది నెలకు 5,670 రూపాయలు, మూడో ఏడాదిలో నెలకు 5,953 రూపాయలు అవుతుంది. అంటే ఏడాదికి 5 శాతం పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటే 20 ఏళ్లకు మీ సంపాదన 68.87 లక్షలవుతుంది. అదే 5 శాతం కాకుండా 10 శాతం పెంచుకుంటూ పోతే 20 ఏళ్లకు కచ్చితంగా 1 కోటి రూపాయలు అవుతుంది. 

SIP లాభాలు

మీ సంపాదనను వేగంగా పెంచుకునేందుకు సిప్ అనేది బెస్ట్ ప్లాన్. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మ్యూచ్యువల్ ఫండ్స్ కూడా మంచి లాభాల్ని ఇస్తాయి. ఎస్ఐపీలను పిల్లల చదువు, పెళ్లి, ఆస్థి కొనుగోలు వంటివాటిని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు ప్రతియేటా పెరిగే జీతంను ఎస్ఐపీ ఇన్వెస్ట్‌మెంట్‌లో యాడ్ చేయడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుంది. స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా ఆదాయం క్రమంగా పెంచుకోవచ్చు. అదే ప్రతియేటా ఎస్ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ పెంచకుండా ఉంటే ఆదాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. 

Also read: ICC T20 World Cup 2024: రేపట్నించే మరో మెగా టోర్నీ, 4 గ్రూపుల్లో 20 దేశాలు, టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్, ఫార్మట్ ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News