Here is Top 5 best mileage scooters in india: పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. 2-3 ఏళ్ల క్రితం రూ. 70లలో ఉండే పెట్రోలు ధర.. నేడు రూ. 110కి చేరింది. దాంతో సామాన్య ప్రజలు బైక్స్, స్కూటర్లు బయటి తీయాలంటేనే భయపడిపోతున్నారు. కాస్త తక్కువ దూరం ఉంటే.. కాలి నడకన వెళుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి భారీగా మైలేజ్ వచ్చే బైక్, స్కూటర్లు కోసం అంతా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక మైలేజీని ఇచ్చే 5 స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
YAMAHA FASCINO HYBRID 125:
యమహా ఫాసినో హైబ్రిడ్ 125 మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఇది 68 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్ 125cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8.2PS/10.3Nm పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫాసినో హైబ్రిడ్ 125 ధర రూ. 76,600 నుంచి రూ. 87,830 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
YAMAHA RAYZR 125:
యమహా రేజర్ 125 స్పోర్టియర్ స్కూటర్. ఇది మైల్డ్-హైబ్రిడ్‌తో కూడిన 125cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది సుమారు 68 kmpl మైలేజీ ఇవ్వగలదు. యమహా రేజర్ ధర రూ. 80,730 నుంచి రూ. 90,130 (ఎక్స్-షోరూమ్) ఉంది. ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
SUZUKI ACCESS 125:
సుజుకి యాక్సెస్ 125 ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది సుమారు 64 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 77,600 నుంచి రూ. 87,200 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 5 లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌ను కలిసి ఉంటుంది.
TVS JUPITER:
టీవీఎస్ జూపిటర్ 110సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ ఇంటెల్లిగో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ లీటరుకు 62 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 70 వేల నుంచి రూ. 85 వేలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
HONDA ACTIVA 6G:
హోండా యాక్టివా 6G 109.51cc, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 60 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 73,086 నుంచి రూ. 76,587 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
Also Read: Ananya Panday Pics: పొట్టి డ్రెస్‌లో అనన్యా పాండే.. మినీ స్కర్ట్ ఉన్నా లేకున్నా ఒకటే!
Also Read: 5 Rupee Note: మీ దగ్గర ఈ 5 రూపాయల నోట్ ఉంటే?.. రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవ్వొచ్చు! లైట్ తీసుకోకండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.