Positive Pay System: పీఎన్‌బీ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. చెక్ లావాదేవిల్లో కీలక మార్పు

Punjab National Bank: చెక్కు ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల్లో కీలక మార్పులు చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. గతంలో రూ.10 లక్షలపై ట్రాన్సక్షన్లకు పీపీఎస్ తప్పనిసరిగా ఉండగా.. తాజాగా రూ.5 లక్షలకు తగ్గించింది. తద్వారా ఆర్థిక మోసాలకు చెక్ పడనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 12:39 AM IST
Positive Pay System: పీఎన్‌బీ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. చెక్ లావాదేవిల్లో కీలక మార్పు

Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లను మోసం నుంచి కాపాడేందుకు చెక్కు చెల్లింపులో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. కస్టమర్లు రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కు చెల్లింపులు చేయడానికి పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) తప్పనిసరి చేసింది. ఈ మార్పు వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

చెక్కు ద్వారా ఏదైనా నకిలీ చెల్లింపు నుంచి కస్టమర్‌లను రక్షించడానికి పీఎన్‌బీ ఈ చర్య తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. అంతకుముందు రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల చెల్లింపు కోసం పీపీఎస్‌లో చెక్కు వివరాలను అందించాల్సిన అవసరం ఉంది. పీపీఎస్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన వ్యవస్థ పీఎన్‌బీ పేర్కొంది. దీని కింద కస్టమర్లు నిర్దిష్ట మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు అవసరమైన వివరాలను నిర్ధారించాల్సి ఉంటుంది.

ఈ వివరాలలో ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, మొత్తం, లబ్ధిదారు పేరు ఉన్నాయి. పెద్ద మొత్తంలో చెక్కులు చెల్లించేటప్పుడు మోసాన్ని నివారించడానికి ఇది అదనపు భద్రతను అందిస్తుంది. ఖాతాదారులు బ్రాంచ్ ఆఫీస్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించి ఈ సదుపాయాన్ని పొందవచ్చని బ్యాంక్ తెలిపింది.
 
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఖాతాదారుడి ఎంపికలో సదుపాయాన్ని పొందడం ద్వారా  2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్‌లో సమర్పించిన రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం పీఎన్‌బీ ముందుగా పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఖాతాదారుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ ఓ అధికారి తెలిపారు. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం దీన్ని తప్పనిసరి చేయడాన్ని బ్యాంకులు పరిగణించవచ్చు.

పీపీఎస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఖాతా సంఖ్య, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, అమౌంట్, లబ్ధిదారుడి పేరు మొదలైనవాటిని నిర్దిష్ట మొత్తం చెక్కును జారీ చేసేటప్పుడు కస్టమర్‌లు అవసరమైన వివరాలను మళ్లీ ధృవీకరించాలి. ఇందులో ఖాతాదారుడు ఈ వివరాలన్నింటినీ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది.

Also Read: IMA On Antibiotics: భారీగా పెరుగుతున్న దగ్గు, జ్వరం కేసులు.. ఈ మందులు అస్సలు వాడకండి

Also Read: Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News