PSU Stocks : 2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!

Cochin Shipyard: మంచి ఫండమెంటల్ ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఈ కొచ్చిన్ ఫిప్ యార్డ్ కూడా ఒకటి. గడిచిన 12నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 250శాతం లాభాలు ఆర్జించింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం.    

Written by - Bhoomi | Last Updated : Aug 11, 2024, 09:53 PM IST
PSU Stocks  :  2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!

Cochin Shipyard Share : స్టాక్ మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి రిటర్న్స్ అంది ఇవ్వాలని పెడుతూ ఉండటం సహజమే. అయితే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ కంపెనీ స్థితిగతులు ఏంటా అని ఆరా తీస్తూ ఉంటాము. అయితే చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్న జాబ్ అని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా కంపెనీ ఫండమెంటల్స్ టెక్నికల్ అర్థం చేసుకోవడం చాలా కష్టమని కూడా చెబుతూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు స్టాక్ మార్కెట్ అనేది టెక్నికల్ విషయంలో చాలామందికి అవగాహన ఉండదు.

ఫలితంగా ఆయా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ డబ్బు ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వకపోవచ్చు లేదా నష్టపోయే ప్రమాదం కూడా ఇందులో అత్యధికంగా ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకున్న దాఖలాలు గడచిన ఐదు సంవత్సరాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల స్టాక్స్ వేల రెట్లు పెరగడం విశేషం తాజాగా కోచింగ్ షిప్ యార్డ్ సంస్థ (Cochin Shipyard) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ (Cochin Shipyard) 2017 వ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అప్పుడు ఈ సంస్థ 264 రూపాయల వద్ద మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఈ స్టాక్ పడుతూ లేస్తూ 2023 వరకు కేవలం రూ. 150 నుంచి రూ. 300 రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ వస్తోంది. 2024 జనవరి నుంచి  ఈ స్టాక్ ఏకంగా 250 శాతం లాభాన్ని అందించింది. 2023 ఆగస్టు నెల నుంచి 2024 ఆగస్టు నెల వరకు ఈ స్టాక్ కదలిక గమనిస్తే రాకెట్ వేగంతో పెరిగిందని చెప్పవచ్చు.

Also Read: Share Market Outlook : సోమవారం షేర్ మార్కెట్ మూడ్ ఎలా ఉంటుంది? ఏయే అంశాలు ప్రభావితం చూపుతాయి?

2023 ఆగస్టు 11వ తేదీన ఈ స్టాక్ ధర 322 రూపాయల వద్ద ఉంది. కానీ ప్రస్తుతం ఈ స్టాక్ ధర అంటే ఆగస్టు 9వ తేదీ నాటికి 2375 రూపాయల వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంటే దాదాపు 635 శాతం ఈ ఏడాది కాలంలో లాభ పడిందని చెప్పవచ్చు. ఇక 2019 నుంచి ఈ స్టాక్ గమనించినట్లయితే, 1250 శాతం లాభపడింది. ఈ స్టాక్ జూలై 12వ తేదీన ఆల్ టైం గరిష్ట స్థాయి 2979 రూపాయల వద్ద అత్యధిక గరిష్ట స్థాయిని తాకింది.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ స్టాక్ భారతదేశంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ మరియు నిర్వహణ సంస్థగా పేరు సంపాదించుకుంది. భారతదేశంలోని కేరళ రాష్ట్రం కొచ్చిన్ నగరంలో ఈ షిప్పియార్డు సేవలు అందిస్తోంది. ఇక ఈ స్టాక్ మదుపుదారులకు ఏ రేంజ్ లో లాభాలను అందించిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఉదాహరణకు 2019 వ సంవత్సరంలో కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీలో  1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాం అనుకుందాం. అంటే 5 సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలో షేరు ధర 175 రూపాయలుగా ఉంది. 

Also Read: Sabja Seeds For Hair Growth : ఈ గింజలు నానబెట్టిన నీళ్లు తాగితే చాలు..పట్టుకుచ్చుల్లాంటి, ఒత్తైన, నల్లని జుట్టు మీ సొంతం..!!

ఈ లెక్కన గమనించినట్లయితే  1 లక్ష రూపాయల పెట్టుబడి కోసం  మీరు 570 షేర్లను కొనుగోలు చేయాలి. ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1 లక్ష రూపాయలు అంటే 570 షేర్ల విలువగల షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జూలై 12వ తేదీ ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.2,979 తాకింది. అంటే మీ షేర్ల విలువ  దాదాపు 17 లక్షల రూపాయలు పెరిగింది అని అర్థం. కేవలం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అక్షరాల 17 లక్షల రూపాయలు లభించేవి ఈ రేంజ్ లో రాబడి ఏ బ్యాంకు లోను లభించదని చెప్పవచ్చు.

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News