Cyber Attack: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి, ఉత్పత్తుల నిలిపివేత

ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై సైబర్ దాడి జరిగింది.  ఫలితంగా 5 దేశాల్లో ఉత్పత్తుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 24 గంటల తరువాత ఉత్పత్తుల్ని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది.

Last Updated : Oct 22, 2020, 06:04 PM IST
Cyber Attack: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి, ఉత్పత్తుల నిలిపివేత

ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ( Dr Reddy's Laboratories ) పై సైబర్ దాడి ( Cyber Attack ) జరిగింది.  ఫలితంగా 5 దేశాల్లో ఉత్పత్తుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 24 గంటల తరువాత ఉత్పత్తుల్ని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో ఉన్న ప్రముఖ ఫార్మా దిగ్గజం. ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఒక్కసారిగా కంపెనీపై సైబర్ దాడి జరిగినట్టు నిర్ధారణైంది. ఫలితంగా 5 దేశాల్లో ఉత్పత్తుల్ని నిలిపివేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ విషయమై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ దాడి నేపధ్యంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉత్పత్తుల్ని నిలిపివేసి..డేటా సెంటర్ సేవల్ని వేరు చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో 24 గంటల అనంతరం ఉత్పత్తుల్ని తిరిగి ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. అమెరికా ( America ), లండన్ ( London ), బ్రెజిల్ ( Brazil ) , రష్యా, ( Russia ) ఇండియా ( India ) ల్లో కంపెనీ తన ఉత్పత్తుల్ని నిలిపివేసింది. సైబర్ దాడి జరిగిందనే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు కూడా తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఓ వైపు కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) ను అభివృద్ధికి ప్రయత్నిస్తూనే మరోవైపు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తి, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఇప్పటికే డీసీజీఐ అనుమతి కూడా తీసుకుంది.

భారత్‌లో స్పుత్నిక్ వి ( Sputnik v vaccine ) వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తి సరఫరాకు ఆర్‌డీఐఎఫ్ హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ (Dr. Reddy’s Laboratories) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. వంద మిలియ‌న్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. అయితే.. భార‌త్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌తోపాటు సరఫరాను డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ చేపట్టనుంది.

Also read: Bihar Assembly election 2020: బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి కరోనా

Trending News