Dubai Flight Fare: దుబాయ్ ప్రయాణానికి పెరిగిన డిమాండ్.. రూ.6 వేలకే ఫ్లైట్ టికెట్?

Dubai Flight Fare: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్ న్యూస్ చెప్పింది. దుబాయ్ ప్రయాణాన్ని ఇప్పుడు మరింత చౌకగా మార్చునున్నట్లు ప్రకటించింది. భారత్ - దుబాయ్ రూట్ లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల ప్రయాణ ఛార్జీలను తగ్గించనున్నట్లు తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 03:06 PM IST
Dubai Flight Fare: దుబాయ్ ప్రయాణానికి పెరిగిన డిమాండ్.. రూ.6 వేలకే ఫ్లైట్ టికెట్?

Dubai Flight Fare: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త డిస్కౌంట్ ను ప్రకటించింది. దుబాయ్ నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్లే విమానాలపై ప్రత్యేక తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ మే 10 నుంచి జూన్ 22 వరకు చెల్లుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. దీంతో కేవలం రూ. 6 వేలకే దుబాయ్ నుంచి ఇండియా వరకు ప్రయాణించవచ్చు. 

దుబాయ్ నుంచి ఇండియాకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆ దేశం నుంచి మరిన్ని విమాన సర్వీస్ లను ప్రారంభించాలని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నిర్ణయించింది. ఇదే విషయమై సదరు విమానయాన సంస్థ UAE తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ భారతదేశానికి వారానికి 170 విమానాలను నడుపుతోంది. అయితే ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో దుబాయ్ ఎయిర్ లైన్స్ సీఈఓ అద్నాన్ ఖాసిమ్ కూడా భారత్ కు ఎక్కువ విమాన సర్వీస్ లను నడిపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

వేసవికి ముందు అనగా ఫిబ్రవరి నుంచి దుబాయ్ నుంచి భారత్ కు వచ్చి పోయే మార్గంలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూఏఈ ప్రభుత్వం కూడా భారత్ కు ఎక్కువ విమాన సర్వీస్ లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటితో పాటు బడ్జెట్ క్యారియర్ విజ్ ఎయిర్ అబుదాబి వంటి కొత్తగా ప్రారంభించిన విమానయాన సంస్థలు భారతదేశానికి సేవలను ప్రారంభించాలనుకుంటున్నాయి.

Also Read: Vivo T1 5G Flipkart: కేవలం రూ.1,500 ధరకే Vivo T1 5G స్మార్ట్ ఫోన్ కొనేయండి!

Also Read: Petrol Price Today: చమురు సంస్థలు కీలక ప్రకటన.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News