EPF Transfer: పీఎఫ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా మంచిది. మీరు మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారా..ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పీఎఫ్ ఎక్కౌంట్ మార్చాల్సిన పరిస్థితి ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలో మారినప్పుడే. అంటే ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు పాత పీఎఫ్ ఎక్కౌంట్నే కొత్త కంపెనీకు ఇచ్చి మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మారిన కొత్త కంపెనీ..ఈపీఎఫ్ నిమిత్తం ప్రైవేట్ ట్రస్ట్ నడుపుతుంటే ఏం చేయాలనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. దానికి సమాధానమే ఇది.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరికి వారు వ్యక్తిగతంగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకు పీఎఫ్ ఎక్కౌంట్ సులభంగా మార్చుకోవచ్చు. పాత ఎక్కౌంట్ ట్రస్ట్ లేదా ఈపీఎప్ఓ వద్ద నిలిచిపోయినా సరే మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ నుంచి కంపెనీ ట్రస్ట్‌కు పీఎఫ్ ఎక్కౌంట్ మార్చేందుకు కొన్ని సులభమైన పద్ధతులు పాటించాలి. ఈపీఎఫ్ ఎక్కౌంట్‌ను ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చు కానీ పాత, కొత్త కంపెనీలు యూనిపైడ్ పోర్టల్‌లో బదిలీ ప్రక్రియ ప్రారంభించాలి. ఒకవేళ మెంబర్ సేవా పోర్టల్‌లో సంబంధిత కంపెనీ లేదా ట్రస్ట్ వివరాలు లేకపోతే..ఆ ఉద్యోగి ఫామ్ 13 ఫిల్ చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సి ఉంటుంది.
ముందుగా ప్రతి వ్యక్తి ఈపీఎఫ్ ఎక్కౌంట్ కేవైసీ పూర్తయిందో లేదో చూసుకోవల్సి ఉటుంది. మీ యూఏఎన్ నెంబర్..ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైందా లేదా సరి చూసుకోవాలి. ఎందుకంటే ఇది తప్పనిసరి. ముందాగ మెంబర్ సేవా పోర్టల్‌లో యూఏఎల్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా ఎక్కౌంట్ లాగిన్ కావల్సి ఉంటుంది.
ఆ తరువాత ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసి..వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఎంచుకోవాలి. ఇప్పుడొక కొత్త విండో ఓపెన్ అవుతుంది. కొత్త పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలు కన్పిస్తాయి. ఇప్పుడు మీరు మీ కొత్త ఈపీఎఫ్ ఎక్కౌంట్ నంబర్ నమోదు చేయాలి. ఇది మీ శాలరీ స్లిప్‌లో తప్పకుండా ఉంటుంది. ఆ తరువాత మీ ఎక్కౌంట్ ఆన్లైన్ బదిలీకు మీ పాత లేదా ప్రస్తుత కంపెనీ ధృవీకరించిందా లేదా అనేది ప్రస్తావించాలి. మీ ప్రస్తుత కంపెనీని సంప్రదించి..ఈపీఎఫ్ ఎక్కౌంట్ బదిలీ ధృవీకరణను ఎంచుకోవాలి.
ఆ తరువాత మెంబర్ ఐడీ నమోదు చేయాలి. ఆ తరువాత గెట్ డీటైల్స్ క్లిక్ చేస్తే.మీ ఈపీఎఫ్ వివరాలు స్క్రీన్ పై కన్పిస్తాయి. డబ్బులు ఎక్కడి నుంచి బదిలీ అయ్యాయో ఎంచుకోండి. చివరిగా గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే..మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి బదిలీ విజ్ఞప్తిని ఎంచుకోవాలి. ఎక్కౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టే. ట్రాకింగ్ ఐడీ వస్తుంది దాని ఆదారంగా మీరు ఆ ప్రక్రియ పూర్తయిందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
Also read: iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook