FD Interest Rate: మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఇటీవల చాలా బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 9.25 శాతానికి పెంచాయి. ముఖ్యంగా మూడు బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై ఏకంగా 9.25 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ మూడు చిన్న, మద్య తరహా ప్రైవేట్ బ్యాంకులు. సాధారణంగా ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ అనేది చిన్న, మద్య తరహా బ్యాంకుల్లోనే లభిస్తుంటుంది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు 3.50 శాతం నుంచి 8.70 శాతం వరకూ ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4 శాతం నుంచి 9.20 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. 12-18 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు అందుబాటులో ఉంది. 5 ఏళ్ల ఎఫ్‌డిపై 7 శాతం వడ్డీ ఉంటుంది. మార్చ్ 2 నుంచి వడ్డీ రేట్లలో ఈ బ్యాంకు మార్పులు చేసింది.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు ఎఫ్‌డీలపై వడ్డీ 4 శాతం నుంచి 9.01 శాతం చెల్లిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4 శాతం నుంచి 9.25 శాతం వరకూ ఇస్తోంది. ఈ బ్యాంకులో అత్యధిక వడ్డీ 9.25 శాతంగా ఉంది. 5 ఏళ్ల ఎఫ్‌డీపై 8.25 శాతం వడ్డీ లభిస్తోంది. మార్చ్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 8.50 శాతం వరకూ ఉన్నాయి. గరిష్టంగా 15 నెలల ఎఫ్‌డీపై 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా అన్ని ఎఫ్‌డీలపై లభిస్తోంది. ఇది కాకుండా 1 ఏడాది వ్యవధి కలిగిన ఎఫ్‌డిపై 8.25 శాతం వడ్డీ, 990 రోజుల ఎఫ్‌డీపై 7.75 శాతం వడ్డీ, 5 ఏళ్ల ఎఫ్‌డీపై 6.50 శాతం వడ్డీ లభిస్తోంది.
Also read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook