Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. రూ. 33 వేల 'పోకో ఎఫ్3 జీటీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.991లకే!

POCO F3 GT 5G smart phone Flipkart Offer. రూ. 32,999 విలువ చేసే పోకో ఎఫ్‌3 జీటీ 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 24, 2022, 05:18 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
  • పోకో ఎమ్ 4 ప్రోపై భారీ తగ్గింపు
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ. 12500 వరకు
Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. రూ. 33 వేల 'పోకో ఎఫ్3 జీటీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.991లకే!

POCO F3 GT 5G smart phone Flipkart Offer: కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలు రకాల స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది 'పోకో ఎఫ్‌3 జీటీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదల అయింది. వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది పోకో. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. 'పోకో ఎఫ్‌3 జీటీ 5జీ (Gunmetal Silver, 128 GB, 6 GB RAM) వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

పోకో ఎఫ్‌3 జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర మార్కెట్లో రూ. 32,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 12 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ. 4000 వేల తగ్గింపుతో.. ఈ మొబైల్ రూ. 28,999 లకు మీకు లభిస్తుంది. మరోవైపు పోకో ఎఫ్‌3 జీటీ 5జీ (Gunmetal Silver, 128 GB, 8 GB RAM) వేరియంట్‌పై 17 శాతం డిస్కౌంట్ అనంతరం రూ. 34,999ల ఈ ఫోన్ రూ. 28,999లకు లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పోకో ఎఫ్‌3 జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. దీంతో పోకో ఎఫ్‌3 జీటీ 5జీ (Gunmetal Silver, 128 GB, 6 GB RAM) వేరియంట్ రూ. 27,999లకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 12,500 వరకు పొందవచ్చు. ఇక EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం రూ. 991లకే ఈ ఫోన్ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

స్పెసిఫికేషన్స్: 
# .67 అంగుళాల టర్బో అమొలెడ్ డిస్‌ప్లే
# మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌
# 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌
# 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5065ఎంఏహెచ్ బ్యాటరీ
# 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Also Read: TNPL Mankading: ఔట్ అయిన అసహనంలో.. మిడిల్ ఫింగర్ చూపించిన భారత బ్యాటర్! మండిపడుతున్న ఫ్యాన్స్‌  

Also Read: White Hair Problem: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News