Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్​ భారీ ఆఫర్స్​​.. రెండు రోజులు మాత్రమే

Flipkart Big Saving Days: ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ మరోసారి బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​ను ప్రారంభించింది. ఈ సేల్​లో ఆఫర్లు ఎలా ఉన్నాయి? స్మార్ట్​ఫోన్లు, టీవీలపై డిస్కౌట్లు ఎంత ఉన్నాయి? అనే వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 12:27 PM IST
  • ఫ్లిప్​కార్ట్​లో అదిరే ఆఫర్లు
  • బిగ్ సేవింగ్ డేస్​ పేరుతో సేల్​
  • స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్​ భారీ ఆఫర్స్​​.. రెండు రోజులు మాత్రమే

Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. బిగ్​ సేవింగ్​ డేస్​ పేరుతో ప్రారంభించిన ఈ స్పెషల్​ సేల్ నేటి నుంచే అందుబాటులోకి వచ్చింది. కేవలం రెండు రోజులు మాత్రమే సాగే ఈ స్పెషల్​ సేల్​లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? స్మార్ట్​ఫోన్లు, టీవీలపై ఆఫర్లు ఎలా ఉన్నాయి. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు..

ఈ స్పెషల్​ సేల్​లో స్మార్ట్​ఫోన్లు, టీవీలు మొదలుకుని అన్ని రకాల ఎలక్ట్రానిక్స్​, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. క్యాటగిరీల వారీగా చూస్తే.. ఎలక్ట్రానిక్స్​పై 50 శాతం వరకు, మొబైల్​ ఫోన్స్​పై 30-40 శాతం వరకు, టీవీలు, ఫ్రిడ్జ్​, ఏసీలు, వాషింగ్ మిషన్ల వంటి వాటిపై గరిష్ఠంగా 60 శాతం వరకు, ల్యాప్​టాప్స్​పై 35-50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.

ఇక దుస్తులపై ఏకంగా 80 శాతం వరకు దగ్గింపు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ఆఫర్లతో పాటు బ్యాంక్ ఆఫర్​ ద్వారా మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్​ పొందే వీలుంది.

బ్యాంక్ ఆఫర్​ వివరాలు..

ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్​ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే తక్షణం 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది.

కొన్ని ఎక్స్​ క్లూజివ్​ ఆఫర్ల వివరాలు..

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ ఇటీవల విడుదల చేసిన రియల్​మీ 9.. విక్రయాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సేల్​లో భాగంగా ఈ స్మార్ట్​ఫోన్ ధరను రూ.15,999గా నిర్ఱయించారు. బ్యాంక్ ఆఫర్​ ద్వారా ఈ ధర మరింత తగ్గనుది.

ఎల్​జీ, శాంసంగ్​, ఎంఐ, రియల్​మీ సహా ఇతర బ్రాండ్లకు చెందిన 4కే టీవీల ధరలు రూ.24,299 నుంచే ప్రారంభమవుతాయని ఫ్లిప్​కారక్ట్ ప్రకటించింది. దీనితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ సమ్మర్​ బొనాంజా ఆఫర్ ద్వారా మరో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

నోట్​: ఈ ఆఫర్లన్నీ ఫ్లిప్​కార్ట్ వెబ్​సైట్ ప్రకారం చెప్పడం జరిగింది. కొనుగోళ్లు జరిపే ముందు ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

Also read: Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!

Also read: Todays Gold Rate: దేశంలో ఏప్రిల్ 12, 2022 ఇవాళ్టి బంగారం ధరలు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News