Super Offer: రూ. 17 వేల రెడ్‌మి నోట్ 10టి 5జి ఫోన్..కేవలం రూ.15 వందలకే, రేపే చివరి రోజు

Flipkart Big Saving Days నడుస్తోంది. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలుంది. కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో కేవలం 15 వందలకే లభించనుంది. ఎలాగంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2022, 01:17 PM IST
Super Offer: రూ. 17 వేల రెడ్‌మి నోట్ 10టి 5జి ఫోన్..కేవలం రూ.15 వందలకే, రేపే చివరి రోజు

Flipkart Big Saving Days నడుస్తోంది. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలుంది. కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో కేవలం 15 వందలకే లభించనుంది. ఎలాగంటే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్ ఇంకా ఒక్కరోజే మిగిలుంది. రేపటితో అంటే ఏప్రిల్ 14తో ఈ ఆఫర్ ముగుస్తుంది. ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్‌లో కొన్ని మోడల్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఈసేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకు లభ్యమౌతున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి ఇటీవల నోట్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. సేల్‌లో ఈ ఫోన్ కేవలం 15 వందల రూపాయలకే లభించనుంది. ఆశ్చర్యంగా ఉందా..ఎలాగో తెలుసుకుందాం..

రెడ్‌మి నోట్ 10టి 5జిలో 4 జిబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్ వేరియంట్ 16 వేల 999 రూపాయలకు లాంచ్ చేసింది కంపెనీ. కానీ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కేవలం 12 వేల 999 రూపాయలకే లభించనుంది. అంటే ఈ ఫోన్‌పై 4 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కాకుండా ఎక్చ్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇది కూడా లెక్కేసుకుంటే ఈ ఫోన్ దర ఇంకా తక్కువైపోతుంది.

రెడ్‌మి నోట్ 10టి 5జి పై 11 వేల 550 రూపాయలు ఎక్స్చేంజ్ అందుతుంది. అంటే మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే..ఈ మొత్తం కూడా తగ్గుతుంది. అయితే మీరు ఎక్చ్సేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. మోడల్ లేటెస్ట్ అయుండాలి. ఒకవేళ మొత్తం ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తే మాత్రం కేవలం 1449 రూపాయలు రెడ్‌మి నోట్ 10టి 5జి ఫోన్ లభించేస్తుంది. 

ఒకవేళ మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేయకపోయినా బ్యాంక్ ఆఫర్ ఉంది మీ కోసం. రెడ్‌మి నోట్ 10టి 5జి కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగిస్తే..మీకు మరో 3 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 9 వేల 999 రూపాయలకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్ ఇంకా ఒక్కరోజే మిగిలింది. త్వరపడండి మరి. 

Also read: Todays Gold Rate: దేశంలో ఇవాళ ఏప్రిల్ 13, 2022 న వివిధ నగరాల్లో బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News