Flipkart Smart TV offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం బోలెడు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. 'బిగ్ బచత్ ధమాల్ సేల్' కింద స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. పలు బ్రాండెడ్ టీవీలపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఉపయోగించుకుంటే సగం కన్నా తక్కువ ధరకే టీవీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.60 వేలు విలువ చేసే ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ రూ.32 వేలకే అందిస్తోంది. అడిషనల్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉపయోగించుకున్నట్లయితే ఈ టీవీని కేవలం రూ.22వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
డిస్కౌంట్ ఆఫర్ :
ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.59,990. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 45 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ టీవీని రూ.32,990కే పొందవచ్చు. ఈ టీవీని డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు రూ.31,990కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.22వేలకే :
ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే రూ. 11వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే.. రూ.32,990 విలువ చేసే టీవీని కేవలం రూ.22,990కే కొనుగోలు చేయొచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై రూ.1వెయ్యి డిస్కౌంట్ కూడా దీనిపై వర్తించినట్లయితే అప్పుడు ధర మరింత తగ్గుతుంది. అంటే.. రూ.21,990కే ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్స్‌కి, ఎక్స్‌చేంజ్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. బిగ్ బచత్ ధమాల్ సేల్ ఉన్నంతవరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ నేటితో ముగియనుంది.
Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook