Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్... రూ.15వేలు విలువ చేసే ఈ ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.999కే...

Thomson R9 80 cm (32 inch) HD LED TV: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.14,990 విలువ చేసే థామ్సన్ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 08:20 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు
  • రూ.15 వేలు విలువ చేసే థామ్సన్ టీవీ కేవలం రూ.499కే
Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్... రూ.15వేలు విలువ చేసే ఈ ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.999కే...

Thomson R9 80 cm (32 inch) HD LED TV: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,990 విలువ చేసే థామ్సన్ ఆర్9 80సెం.మీ (32 అంగుళాలు) టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చే పూర్తి డిస్కౌంట్ వర్తించినట్లయితే ఈ టీవీని కేవలం రూ.999కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... 

బిగ్ డిస్కౌంట్ :

థామ్సన్ ఆర్9 80సెం.మీ (32 అంగుళాలు) టీవీ సాధారణ ధర రూ.14,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 43 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8499కే ఇది అందుబాటులో ఉంది. ఈ టీవీ కొనుగోలుకు మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.1 వెయ్యి వరకు డిస్కౌంట్ పొందుతారు. అప్పుడు రూ.7499కే దీన్ని పొందవచ్చు. అయితే డిస్కౌంట్‌కి కొన్ని కండిషన్స్ ఉంటాయని మరిచిపోవద్దు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భారీ తగ్గింపు : 

రూ.8499కి అందుబాటులో ఉన్న ఈ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.7500 వరకు తగ్గింపు లభిస్తోంది. మీ పాత టీవీని ఇచ్చి కొత్త టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ ఎక్స్‌చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే ఈ టీవీని కేవలం రూ.999కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయని మరిచిపోవద్దు. 

Also Read: Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...

Also Read: Gyanavapi masjid Dispute: ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం... జ్ఙానవాపి మసీదు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News