Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

Gold Rate : దేశంలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 100తగ్గి..రూ. 70, 389 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,470 రూపాయలు పలుకుతోంది.  

Written by - Bhoomi | Last Updated : Aug 9, 2024, 06:35 AM IST
Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

Gold and Silver Prices :  బంగారం ధరలు ఆగస్టు 9 శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 70, 389 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,470 రూపాయలు పలుకుతోంది. అయితే గడచిన రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర దాదాపు 1200 రూపాయల వరకు తగ్గింది. వరుసగా మూడోసారి  ప్రస్తుతం బంగారం ధర 100 రూపాయలు తగ్గింది. 

బంగారం ధర శ్రావణమాసంలో తగ్గు ముఖం పడుతుందని బులియన్ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు దేశీయంగా కూడా తక్కువ వస్తాయని అంతా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా రికవరీ బాట పడుతున్నాయి. దీంతో పసిడి ధరలు మళ్ళీ నగలు కొనుగోలు చేసే వారికి ఊరట ఇస్తున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గు ముఖం పడితే ఈ శ్రావణ మాసంలో భారీగా నగల వ్యాపారం జరుగుతుందని ఆభరణాల దుకాణాల వారు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే గత నెలలో బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతి సుంకం భారీగా తగ్గించడంతో ఒకేరోజు బంగారం ధర దాదాపు 4000 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఆల్ టైం గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయల నుంచి బంగారం ధర 67 వేల రూపాయలకు పతనమైంది. ఇక్కడి నుంచి బంగారం ధర స్వల్పంగా రికవరీ అవుతూ మళ్ళీ 71 వేల రూపాయల వద్దకు చేరుకుంది. కాగా గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. దీంతో దాదాపు 1200 రూపాయలు తగ్గి బంగారం ధర ప్రస్తుతం రూ.70,000 సమీపంలో ట్రేడ్ అవుతోంది.

Also Read: Neeraj Chopra : నీరజ్ ఈటెకు చిక్కిన రజతం..జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..హిస్టరీ క్రియేట్ చేసిన బల్లెం వీరుడు 

పసిడి ధరలు భవిష్యత్తులో ఏ మేరకు తగ్గుతాయి. అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి సంక్షోభం కారణంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లో భారీగా పతనం అయ్యాయి. అయినప్పటికీ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం రికవరీ బాటలో ఉన్నాయి. అయితే అమెరికా ఆర్థిక మందంలోకి వెళుతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే కీలక నిర్ణయాలపైనే బంగారం ధరలు ఆధారపడి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు పెంచినట్లయితే, పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఒకవేళ కీలక వడ్డీ రేట్లు పెంచినట్లయితే, అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేస్తారు. అలాంటప్పుడు బంగారం నుంచి పెట్టుబడులు బాండ్ల వైపు తరలుతాయి. ఫలితంగా బంగారం ధరలు తగ్గుతాయి అని బులియన్ పండితులు చెబుతున్నారు.

​Also Read: CIBIL Score: మీ సిబిల్ స్కోర్ 500 కంటే తక్కువగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే...800 అవ్వడం గ్యారెంటీ..!! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News