Todays Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..??

Todays Gold Rate: బంగారం ధరలు వరుసగా రెండవరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నిన్నట్నించి స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2022, 10:20 AM IST
 Todays Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..??

Todays Gold Rate: బంగారం ధరలు వరుసగా రెండవరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నిన్నట్నించి స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీరేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. బంగారం ధర గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చింది. నిన్నట్నించి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఇవాళ రెండవరోజు కూడా బంగారం ధరలో మార్పు లేదు. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 60 రూపాయలుగా ఉంది. అటు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 140 రూపాయలు పలుకుతుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 5 వేల 7 వందలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. కేరళలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 60 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Also read: Amazon sale: ఇయర్ బడ్స్​పై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు- పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News