ONGC Recruitment 2024: పరీక్ష లేకుండానే ఓఎన్జీసీలో ఉద్యోగం, మార్చ్ 4 ఆఖరు తేదీ

ONGC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూసే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రిక్రూట్ మెంట్ చేపట్టింది. పరిమిత సంఖ్యలోనే ఖాళీలుండటంతో పోటీ ఎక్కువగా ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 29, 2024, 03:21 PM IST
ONGC Recruitment 2024: పరీక్ష లేకుండానే ఓఎన్జీసీలో ఉద్యోగం, మార్చ్ 4 ఆఖరు తేదీ

ONGC Recruitment 2024: డెహ్రాడూన్ ప్రధాన కార్యాలయంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్ రంగంలో గణనీయమైన కృషి చేస్తున్న ఓఎన్జీసీ గురించి తెలియనివారుండరు. చెన్నైలోని ఓఎన్జీసీ కార్యాలయంలో మూడే మూడు కీలక పోస్టుల్ని భర్తీ చేయనుంది. అర్హత కలిగిన ఆసక్తి కల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

చెన్నైలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కార్యాలయంలో మూడు కీలకమైన పోస్టుల రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ కార్యాలయంలో జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, మెరైన్ రేడియో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు rrochn@ongc.co.inకు నిర్దేశిత నమూనాలో తమ దరఖాస్తును మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదా ఓఎన్జీసీ కార్యాలయం, ఇన్ఫోకామ్ సెక్షన్, 10వ అంతస్థు, సీఎండీఏ టవర్ 1, చెన్నైకు నేరుగా వెళ్లి అందించవచ్చు.

ఓఎన్జీసీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్  https://ongcindia.com/web/eng/career/recruitment-notice ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు మార్చ్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ గడువుంది. ఇంటర్వ్యూ సమయం, తేదీ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. రిటైర్ అయిన రేడియో ఆఫీసర్లు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అయితే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జారీ చేసిన జీఎండీఎస్ఎస్, సీఓపీ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఓఎన్డీసీలో పదవీ విరమణ పొంది రేడియో ఆపరేషన్లలో కనీస పదేళ్లు అనుభవం కలిగి ఉండాలి. మార్చ్ 4, 2024 నాటికి అతడి వయస్సు 64 ఏళ్లు మించకూడదు. 

ఈ పోస్టులకు అప్లై చేసేవారి వయస్సు 64 కంటే తక్కువ ఉండాలి. జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు జీతం నెలకు 42 వేలు కాగా, అసిస్టెంట్ కన్సల్టెంట్ ఉద్యోగానికి 68 వేలుంటుంది.  మొత్తం మూడు పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు టీఏ, డీఏతో పాటు వసతి కూడా కల్పిస్తారు. 

Also read: Call Forwarding Scam: కాల్ ఫార్వర్డ్ స్కామ్ అంటే ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Also read: SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉన్నత కొలువులు, మార్చ్ 4 గడువు తేదీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News