Gpay Cashback: యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పేలో మీకు క్యాష్‌బ్యాక్ రావడం లేదా.. కొన్ని టిప్స్ పాటిస్తే క్యాష్‌బ్యాక్ అవకాశాలు పెరుగుతాయి. అవేంటో చూద్దాం..
గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం..ఇలా ఇప్పుడు ప్రతీది..ప్రతిచోటా డిజిటల్ పేమెంట్లే నడుస్తున్నాయి. ఎందుకంటే పేమెంట్ చేయడంలో అత్యంత సులభమైన విధానమిది. అందుకే ఆన్‌లైన్ చెల్లింపుల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 5 రూపాయలైనా సరే డిజిటల్ లావాదేవీ ద్వారానే చెల్లిస్తున్నారు. ఇందులో ఒకటి గూగుల్ పే. యూజర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఇస్తుంటుంది. ప్రతిసారీ లభించదు కానీ..అప్పుడప్పుడూ వస్తుంటుంది. అందుకే కొన్ని ట్రిక్స్, టిప్స్ పాటిస్తే గూగుల్ పేలో క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు పెరుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..
ఒకే యూజర్‌కు పలుసార్లు చెల్లింపులు జరుపుతుంటే క్యాష్‌బ్యాక్ లభిస్తుందని భావించవద్దు. వేర్వేరు యూజర్లకు చెల్లింపులు జరుపుతుంటే క్యాష్‌బ్యాక్ అవకాశాలు పెరుగుతుంటాయి. చాలామంది పెద్ద మొత్తం లావాదేవీలు జరిపితే క్యాష్‌బ్యాక్ కచ్చితంగా వస్తుందని భావిస్తుంటారు. కానీ అలా జరగదు. ఎక్కువ లావాదేవీలు జరపాలనుకుంటే..100 నుంచి 1000 రూపాయల మధ్యే ఎక్కువగా చెల్లింపులు చేస్తే క్యాష్‌బ్యాక్ అవకాశాలు పెరుగుతాయి. అంటే ఎవరికైనా 3 వేలు పంపించాలనుకుంటే..ఒకేసారి పంపించకుండా..3 సార్లు వేయి రూపాయల చొప్పున పంపిస్తే మంచిది.
గూగుల్ పేలో అప్పుడప్పుడూ ఆఫర్లు వస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లలో తరచూ పాల్గొంటుంటే క్యాష్‌బ్యాక్ పొందేందుకు అవకాశముంటుంది.
Also read: LIC Policy Claim: పాలసీదారుడి మరణం తరువాత..నామినీ ఆ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link- https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook