GST portal server down: జీఎస్టీ పోర్టల్ ఆన్లైన్ సర్వీసులు డౌన్ అవ్వడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జిఎస్టి రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జనవరి 11న నిర్ణయించారు. అయితే జిఎస్టి పోర్టల్ గత 24 గంటలుగా పని చేయడం లేదు. అంటే గురువారం నుంచి పోర్టల్ అందుబాటులో లేదు. ఈ కారణంగా చాలామంది వ్యాపారులు రిటర్న్స్ దాఖలు చేయలేకపోయారు. గడువులోగా జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిఎస్టి పోర్టల్ సమస్యను పరిష్కరించడానికి జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు గడువును పొడిగించాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిఎస్టిఎన్ ఈ సమస్యను అంగీకరించి టెక్నికల్ బృందం త్వరలోనే సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపింది.
జనవరి 8 నుంచి జిఎస్టి పోర్టల్ పనిచేయడం లేదని ఇప్పటికే పలువురు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. జీఎస్టీ ఆర్ వన్ ఫారం కూడా ఇంకా పోర్టల్ లో అప్లోడ్ కాలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పాటు డేటాను అప్లోడ్ చేసినప్పుడు పెండింగ్ అనే మెసేజ్ చివరికి వరకు వస్తుందని ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొంటున్నారు. గడిచిన 24 గంటలపాటు పలువురు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిఎస్టిఎన్ అధికార సోషల్ మీడియా హ్యాండ్ గురువారం ఈ సమస్యను ప్రస్తావిస్తూ సమాచారాన్ని తెలిపింది.
Also read: Business Ideas: ఎకరం భూమి ఉంటే చాలు.. ఈ పంట పండిస్తే.. మీ ఇంట కనక వర్షం కురిసినట్లే
వ్యాపారస్తులు తమ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా తమ టెక్నికల్ సిబ్బంది శాయశక్తుల ప్రయత్నిస్తుందని వారు తెలిపారు. అయితే పోర్టల్ డౌన్ ఉండడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. నిజానికి చాలామంది వ్యాపారస్తులు చివరి రోజున ఫైలింగ్ సమర్పించాలని ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని కొన్ని నిమిషాల క్రితం పోస్ట్ చేసిన తాజా వినియోగదారులకు తెలియజేసింది. అయినప్పటికీ పోర్టల్ ఇంకా డౌన్ సమస్య తీరనేలేదు.
ఇదిలా ఉంటే జిఎస్టి రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ విభాగం కూడా సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తోంది. అతి త్వరలోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సందర్భంగా బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఇది అమల్లోకి రాగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎవరైనా జీఎస్టీ దాఖలు చేయాలంటే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Dear Taxpayers!📢
GST portal is currently experiencing technical issues and is under maintenance. We expect the portal to be operational by 12:00 noon. CBIC is being sent an incident report to consider extension in filing date.
Thank you for your understanding and patience!
— GST Tech (@Infosys_GSTN) January 10, 2025
Also read: Tirumala VIP Darshans: తిరుమలలో భారీగా వీఐపీ దర్శనాలు, ప్రాణాలు పోతున్న మారని టీటీడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.