Tirumala VIP Darshans: వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ ఈవో వర్సెస్ టీటీడీ ఛైర్మన్ నువ్వెంతంటే నువ్వెంతని వాగ్వాదానికి దిగారు. ఇంతలా జరుగుతున్నా వీఐపీ దర్శనాలు మాత్రం ఆగడం లేదు.
తిరుమల తొక్కిసలాట ఘటనలో సామాన్యుల ప్రాణాలు పోవడంతో ఇప్పటికే ఆందోళన రేగుతోంది. టీటీడీ అధికారులకు పాలకమండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంత జరిగినా తిరుమల దేవస్థానం వ్యవహారశైలిలో మాత్రం మార్పు రాలేదు. సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్నా వీఐపీ దర్శనాలు మాత్రం ఆపలేదు. ఇంకా వీఐపీలకే పెద్దపీట వేస్తోంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మళ్లీ పెద్దఎత్తున వీఐపీలు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్నించి భారీగా ప్రముఖులు సందర్శించుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో పతంజలి రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉన్నారు.
ఇక తెలంగాణ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర్ రాజనర్శింహతో పాటు ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గెడ్డం వినోద్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీతా లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇక ఏపీ నుంచి మంత్రులు పార్ధసారధి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణితో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ సీఎం రమేస్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బండ్ల గణేశ్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, క్రీడాకారులు చాముండేశ్వరి నాథ్, పుల్లెల గోపీచంద్, వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.
Also read: Inter Exams New Patter: ఇంటర్ పరీక్షల విధానంపై క్లారిటీ, వచ్చే ఏడాది నుంచి కొత్త విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.