Hero Splendor Bike: ఇండియాలోని టూ వీలర్ బైక్స్‌లో అత్యధిక ఆదరణ పొందినవి హీరో కంపెనీ బైక్స్. గతంలో హోండా కంపెనీ భాగస్వామ్యంతో బైక్స్ లాంచ్ చేసిన హీరో కంపెనీ చాలాకాలం నుంచి సొంతంగా లాంచ్ చేస్తోంది. అయినా ఇప్పటికీ హీరో మోటోకార్ప్ బైక్స్ అంటే అందరికీ క్రేజ్. మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు. మైలేజ్ అధికంగా ఇస్తాయి. అందుకే ఆందరికీ హీరో బైక్స్ అంటే క్రేజ్ ఎక్కువ.
గతంలో మార్కెట్లో ఉన్న Hero Honda Splendor అంటే చాలా క్రేజ్ కలిగిన బైక్. ఆ తరువాత హోండా నుంచి విడిపోయాక Hero Splendor + XTEC 2.0 పేరుతో లాంచ్ అయింది. మైలేజ్ అత్యధికంగా ఇస్తుండటంతో ఆదరణ లభిస్తోంది. లీటరు పెట్రోల్‌పై ఏకంగా 73 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ బైక్ 100 సిసి ఇంజన్, 7.9 బీహెచ్‌పి వపర్, 70 వేల కిలోమీటర్ల వారంటీతో వస్తోంది. 6000 కిలోమీటర్ల వరకూ ఎలాంటి సర్వీస్ అవసరం లేదని హీరో కంపెనీ చెబుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ ఇది బెస్ట్ ఆప్షన్.
Hero Splendor + XTEC 2.0 బైక్‌లో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. హెజార్డ్ లైటింగ్, సైడ్ ఇంజన్ కటాఫ్ ఉన్నాయి. ఈ భైక్ మార్కెట్ ధర 82,911 రూపాయలుగా ఉంది.
Also read: Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook