Honda CB200X 2023: మరో హోండా బైక్ రిలీజ్.. రూ.1.47 లక్షలతో సూపర్ స్పోర్ట్స్ మోడల్ బైక్

యువతకు మోటార్ బైక్ లపై ఆసక్తి ఎక్కువ.. వారి వారి ఇష్టాలకు అనుసారంగా మోటార్ బైక్ కంపెనీలు అప్డేట్ వర్షన్ లను విడుదల చేస్తున్నాయి. హోండా నుండి CB200X ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బైక్ ఫీచర్స్, అప్డేట్స్ మరియు ధర వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 01:38 PM IST
Honda CB200X 2023: మరో హోండా బైక్ రిలీజ్.. రూ.1.47 లక్షలతో సూపర్ స్పోర్ట్స్ మోడల్ బైక్

Honda CB200X 2023: దేశంలో యువత మోటార్ సైకిళ్లపై ఎక్కువ ప్రియంగా ఉంటారు. అలాంటి వారికి నిత్యం ఏదో ఒక మోడల్ మార్కెట్లోకి వచ్చి ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహానాల తయారీదారులు వారి వారి ఉత్పత్తులను నవీకరిస్తున్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని మెరుగుపరుచుకొని వినియోగదారులను మరింత ఆకట్టుకుంటోంది. హోండా మోటార్ సైకిల్ & స్కూటర్స్ ఇండియా (HMSI) ఇప్పుడు సరికొత్త CB 200x హార్నెట్ 2.o ను విడుదల చేసింది. సిటీల్లోని తక్కువ దూరాలకు వెళ్లాలనుకునే వారికి కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అప్‌డేట్ చేసిన సరికొత్త హార్నెట్ ప్రత్యేకంగా రూ. 1,46,999 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధరకు అందుబాటులో ఉంది. ఇప్పుడీ మోడల్ మీ సమీప హోండా డీలర్స్ వద్ద లభ్యమవుతోంది. 

హోండా CB200X డిజైన్
లెజెండరీ హోండా CB500x ADV నుంచి ఈ సరికొత్త CB200X డిజైన్.. వీకెండ్ ప్రయాణాలకు రైడర్‌కి సరైన ఎంపికగా ఉంది. దిట్టమైన బాడీవర్క్ తో లుక్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులో డైమండ్ వేరియంట్ స్టీల్ ఫ్రేమ్ తో ఎక్స్ట్రీమ్ LED లైటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. LED హెడ్‌ల్యాంప్, LED వింకర్స్, X- షేప్ LED టెయిల్ ల్యాంప్ ఉంటుంది. 

హోండా CB200X 2023 - పనితీరు..
సరికొత్త హోండా CB200xలో 184.40 CCతో పాటు 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ BSVI OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజిన్ ఉంది. గతంలో ఉన్న మోడల్స్ తో పాటు పోల్చుకుంటే ఇది పర్యావరణానికి తక్కువ హానిని కలిగిస్తుంది. గరిష్టంగా 8,500 RPMతో 12.70 kW సహా 6 వేల RPM వద్ద 15.9 Nm గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ బైక్ నడిపే వ్యక్తి భద్రత కోసం CB220x లో సింగిల్ ఛానల్ ABSతో డ్యుయల్ పెటల్ డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంది. దీంతో పాటు కొత్త అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల గేర్ వెంట వెంటనే మార్చేందుకు మరింత సులభతరం కానుంది. డౌన్ షిఫ్టింగ్ సమయంలో వెనుక చక్రాల లాకింగ్‌ను నిరోధిస్తుంది.

Also Read: Vivo V29E Price: గణేష్‌ పండగ సందర్భంగా Vivo V29e మొబైల్‌పై 15 శాతం తగ్గింపు, అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

హోండా CB200X ధర
2023లో విడుదల చేసిన సరికొత్త CB200X మోడల్.. మూడు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. డీసెంట్ బ్లూ మెటాలిక్ (కొత్త), పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ కలిగి ఉన్నాయి. హోండా CB200X ధర మార్కెట్లో రూ. 1,46,999 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హోండా మోటార్ సైకిల్స్ సంస్థ నుంచి ప్రత్యేకంగా 10 ఏళ్ల వారెంటీ ప్యాకేజీ కూడా లభిస్తుంది. ఇందులో మొదటి 3 ఏళ్లు ప్రామాణికంగా వారెంటీ వర్తిస్తుండగా.. 7 ఏళ్ల పాటు ఆప్షనల్ ఎంచుకునేందుకు అవకాశం ఉంది.

Also Read: Namrata Malla in without BRA Look: మత్తెక్కించే కళ్లతో మగాళ్ల ఉసురు తీసేస్తోన్న మాయలేడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News