Car Mileage Tips: కారు మైలేజ్ పెంచుకునే మార్గాలు

Simple Tips to Increase Car Mileage: కారు మెయింటెన్ చేసే వారిలో చాలామందికి సాదారణంగా ఎదురయ్యే సమస్య ఒక్కటే. వాహనం మైలేజ్ పెంచుకోవడం ఎలా అనేదే చాలామంది వాహనదారులకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. అయితే, కారు మైలేజ్ పెంచుకోవడానికి కూడా కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2023, 07:31 AM IST
Car Mileage Tips: కారు మైలేజ్ పెంచుకునే మార్గాలు

How to Increase Car Mileage: కారు డ్రైవింగ్ చేసే క్రమంలో, కారును మెయింటెన్ చేసే క్రమంలో తెలియకుండానే చేసే పొరపాట్లు కారు మైలేజ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియకపోవడంతో.. కారు మైలేజ్ ఎందుకు తగ్గుతోందని టెన్షన్ పడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే.. కారు మైలేజ్ మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

ఇంజిన్ హెల్త్ ముఖ్యం
ఇంజన్ కండిషన్ సరిగ్గా లేకపోతే కారు ఇంధనం ఎక్కువ తీసుకుంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా లేకపోతే.. అది ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది. ఫలితంగా మిక్సర్‌కి ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో ఇంధనంపై భారం పడుతుంది. ఈ కారణంగానే ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది.

అనవసర భారం లేకుండా చూసుకోండి
కారులో కొంతమంది అవసరంతో సంబంధం లేకుండా అనవసరంగా అవి ఇవి వస్తుసామాగ్రి క్యారీ చేస్తుంటారు. ముఖ్యంగా బూట్ స్పేస్ ఎప్పుడూ ఏదో ఒకదానితో నింపేస్తారు. ఆ అనవసర భారాన్ని ముందుకు లాగే క్రమంలో ఇంకొంత ఎక్కువ ఫ్యూయెల్ ఖర్చు అవుతుంది. ఆ అనవసర భారాన్ని తగ్గించుకుంటే ఆటోమేటిగ్గా కారు స్మూత్‌గా ముందుకు దూసుకుపోతుంది. 

సరైన ఇంజన్ ఆయిల్
ప్రతీ ఇంజన్‌కి ఒక రూల్ బుక్ ఉంటుంది. దానినే మనం మాన్యువల్ అని పిలుస్తాం. వాహనంతో వచ్చిన మాన్యువల్‌లో ఆ ఇంజన్‌కి ఏ గ్రేడ్ ఆయిల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందో.. దానినే వినియోగించాల్సిందిగా సూచిస్తారు. అలా సూచించిన గ్రేడ్ ఆయిల్ ఉపయోగిస్తేనే... ఇంజన్ కూడా సరైన మైలేజ్ ఇస్తుంది.  

క్లచ్ పెడల్‌పై పాదం 
క్లచ్ పెడల్‌పై పాదాన్ని అలాగే పెట్టి ఉంచొద్దు. ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. అలాగే యాక్సిలరేటర్ కూడా అంతే. ఒకేసారి సడెన్‌గా యాక్సిలరేట్ చేయడం, వెంటనే బ్రేక్ వేయడం, మళ్లీ వెంటనే అమాంతం యాక్సిలరేట్ చేయడం లాంటివి చేయొద్దు. అవి మైలేజ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

టైర్లలో రైట్ ఎయిర్‌ప్రెషర్
టైర్ల సైజునిబట్టి వాటికి ఒక ఎయిర్ ప్రెషర్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎప్పుడూ ఎయిర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఎయిర్ ప్రెషర్ తగ్గినట్టయితే.. టైర్లకు, రోడ్డుకు మధ్య ఫిక్షన్ ఎక్కువై మైలేజ్ తగ్గిపోతుంది. 

వీల్ అలైన్మెంట్ చెక్ చేసుకోండి
వీల్ అలైన్మెంట్ సరిగ్గా ఉండాలి. లేదంటే టైర్లకు, స్టీరింగ్‌కి మధ్య సమన్వయం కొరవడి ఆ ప్రభావం మైలేజ్‌పై చూపిస్తుంది. కారు సర్వీసింగ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల 10 శాతం మైలేజ్ తగ్గిపోతుందని చెబుతున్నారు. 
 
గేర్స్ మార్చడంలో
గేర్స్ మార్చే క్రమంలో వాహనం స్పీడుకు అనుగుణంగా గేర్ మార్చాల్సి ఉంటుంది. తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువ గేర్ వేయడం వంటివి చేస్తే ఇంజన్ ఆ స్పీడ్ ఎత్తుకోలేక ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది.

ఇది కూడా చదవండి : Maruti Dzire sedan Price: రూ. 7 లక్షల విలువైన సెడాన్ కారును రూ. లక్ష చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి..!

స్పీడ్ మెయింటెనెన్స్
వాహనం డ్రైవ్ చేసేటప్పుడు ఎకానమి స్పీడ్ మెయింటెన్ చేస్తే ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా హై స్పీడులో వెళ్తే.. స్పీడ్ పెరిగే కొద్ది ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. కారు కొనుగోలు చేసే సమయంలోనే ఈ టెక్నిక్స్ తెలుసుకుని ఉంటే.. కారు మైలేజ్ పెంచుకోవడమే కాదు.. కారు ఇంజన్ లైఫ్ కూడా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. 

ఇది కూడా చదవండి : 

Renault Kwid, Kiger, Triber Discounts: రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ. 65 వేల వేరకు బెనిఫిట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News