Hyundai New EV Cars 2025: హ్యుందాయ్ ఇండియా 2030 సంవత్సరం నాటికి ఆటో మొబైల్ కంపెనీ మార్కెట్‌లో మంచి పేరును పొందడానికి ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంలో త్వరలోనే మరో 5 EV కార్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ వీటిని అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లలో ఈ ఏడాది చివరి నాటికి కొన్ని కార్లను లాంచ్ చేసి, 2025 సంవత్సరంలో మరికొన్ని విడుదల చేయబోతున్నట్లు కంపెనీ యోచిస్తోందని సమాచారం. అలాగే త్వరలోనే లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ కార్లు 500 కి.మీ మైలేజీ సామార్థ్యంతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గతంలో హ్యుందాయ్ లాంచ్ చేసిన క్రెటాకి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించడం వల్ల దీనిని అప్‌డేట్ వేరియంట్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. అంతేకాకుండా ICE క్రెటా కారుకు సంబంధించి డిజైన్‌తో పాటు ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక దీని ధర విషయానికొస్తే, రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి మార్కెట్‌లో ఈ కారుపై లాంచింగ్‌కి ముందే మంచి స్పందన లభించింది.
అల్కాజర్ EV:
హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV, వెన్యూ EV కార్లను మార్కెట్‌లోకి లాంచ్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ అల్కాజర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించి ఫీచర్స్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
హ్యుందాయ్ Exeter EV:
హ్యుందాయ్ కంపెనీ Exeter కారును కూడా ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు మార్కెట్‌లోకి ఈవీ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తే..Tiago EV, పంచ్ EV, MG కామెట్, టాటా టిగోర్ EVతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అంచనాల ప్రకారం, కంపెనీ దీనిని సుమారు రూ. 10-12 లక్షలు (ఎక్స్-షోరూమ్)లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి