IDFC Limited: అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఐడీఎఫ్‎సీ, ఐడీఎఫ్‎సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. ఖాతాదారులు,షేర్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే

Merger of IDFC: IDFC ఫస్ట్‌ బ్యాంక్‌లో IDFC విలీనానికి ఇరు సంస్థల బోర్డులు కూడా ఆమోదం తెలిపాయి. కాగా ఈ విలీనం అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నది. ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, చెన్నై బెంచ్‌ పచ్చజెండా ఊపింది. ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 ఈక్విటీ షేర్లకుగాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌నకు చెందిన 155 ఈక్విటీ షేర్లు లభిస్తాయి. 

Written by - Bhoomi | Last Updated : Sep 30, 2024, 09:57 PM IST
IDFC Limited: అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఐడీఎఫ్‎సీ, ఐడీఎఫ్‎సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. ఖాతాదారులు,షేర్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే

IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్, IDFC లిమిటెడ్ విలీనం పూర్తయింది. అన్ని అనుమతుల తర్వాత అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విలీనం వల్ల షేర్ హోల్డర్లు లాభపడనున్నారు. IDFC  ప్రతి వాటాదారునికి 100 షేర్లకు బదులుగా IDFC బ్యాంక్  155 షేర్లు ఇవ్వనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ విలీనంతో IDFC కార్పొరేట్ నిర్మాణం సరళంగా మారుతుంది. ప్రమోటర్ల హోల్డింగ్ తగ్గుతుంది. వృత్తిపరమైన నిర్వహణ పెరుగుతుంది.

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఈ విలీనాన్ని శుక్రవారంతో పూర్తి చేసినట్లు ప్రకటించింది. షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అనుమతుల తర్వాత వచ్చే నెల నుంచి ఈ విలీనం అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఐడిఎఫ్‌సి షేర్ల మార్పిడికి రికార్డు తేదీగా అక్టోబర్ 10గా నిర్ణయించింది. ఈ షేర్లు అక్టోబర్ 31లోపు వాటాదారులకు అందజేస్తుంది. ఈ విలీనం కారణంగా, బ్యాంక్‌కు ఎలాంటి హోల్డింగ్ కంపెనీ ఉండకపోవడమే అతిపెద్ద ప్రయోజనమని చెప్పవచ్చు. ఇతర పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల మాదిరిగానే ఇప్పుడు మా షేర్ హోల్డింగ్ సరళంగా మారుతుందని బ్యాంక్ తెలిపింది. ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ లేదు. దీంతోపాటు బ్యాంకు నిర్వహణ కూడా మరింత సులువుగా మారుతుంది. 

Also Read: Investment Plan: జస్ట్ రూ. 250లతో ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు..మీ కూతురు కాలేజీ ఫీజు కట్టేయొచ్చు  

ఈ విలీనం వల్ల బ్యాంకుకు దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరనుంది. దాదాపు రెండేళ్లుగా ఈ విలీనం కోసం ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్ తెలిపారు. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకోగలిగామన్నారు. ఈ విలీనం భవిష్యత్తులో బ్యాంకుకు భారీ ప్రయోజనాలను తెస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు. మేము మా కస్టమర్‌లకు మెరుగైన రీతిలో సేవలందించగలుగుతాము. మా కార్పొరేట్ నిర్మాణం ఇప్పుడు ఈ రంగంలోని ఇతర ప్రముఖ బ్యాంకుల వలె మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   

Also Read: Success Story:  ఓ బ్యాచిలర్ గదిలో పుట్టిన ఐడియా.. 35వేల కోట్లు సామ్రాజ్యానికి పునాది.. బెజవాడ బ్యాచిలర్ సక్సెస్ స్టోరీ ఇదే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News