IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది, జూలై 31 ఆఖరు తేదీ, ఎలా చేయాలి

IT Returns: మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. పాత ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లించేందుకు సిద్ధం కండి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు చివరి తేదీ ఎప్పుడు, ముఖ్యమైన సూచనలేంటనేది పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2022, 10:14 AM IST
  • ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఆసన్నం, సిద్ధం చేసిన ఐటీ శాఖ
  • 2021-22 ఆర్ధిక సంవత్సరం రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జూలై 31, 2022
  • ఐటీఆర్ ఫారమ్ 1, 4లకు సంబంధించి సూచనలు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ
  IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది, జూలై 31 ఆఖరు తేదీ, ఎలా చేయాలి

IT Returns: మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. పాత ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లించేందుకు సిద్ధం కండి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు చివరి తేదీ ఎప్పుడు, ముఖ్యమైన సూచనలేంటనేది పరిశీలిద్దాం..

నిర్థీత ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ ఉద్యోగులైనా, వ్యాపారులైనా తప్పకుండా ప్రతి యేటా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. 2021-22 ఆర్ధిక సంవత్సరం మార్చ్ 31తో ముగిసింది. ముగిసిన ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సిద్ధం కండి. ఎందుకంటే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఫారమ్ 1,4 దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. గడిచిన ఆర్ధిక సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ జూలై 7, 2022. ఈ ఏడాది ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారు గుర్తుంచుకోవల్సిన కొన్ని సూచనలు..

ఈసారి ఫారమ్ 1, 4లో చిన్న చిన్న మార్పులున్నాయి. మీ వివరాల్ని డాక్యుమెంట్ల రూపంలో సిద్ధంగా ఉంటే..ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. దీనికోసం అవసరమైన కాగితాల్ని సిద్దం చేసుకోండి. ఐటీఆర్ ఫారమ్ 1 ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు.ఈ వ్యక్తి ట్యాక్సెబుల్ ఆదాయం ఏడాదికి 50 లక్షల రూపాయల మించకూడదు. జీతం, పెన్షన్, ఇంటి మీద వచ్చే ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, వ్యవసాయ ఆదాయం 5 వేల లోపున్నవాళ్లు ఈ ఫారమ్ దాఖలు చేయవచ్చు. బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ, డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నవాళ్లు కూడా ఫారమ్ 1 సమర్పించాలి.

ఇక ఐటీఆర్ ఫారమ్ 4 కేవలం వ్యాపారులకు మాత్రమే. వేతన జీవులకు ఇది వర్తించదు. ఇక్కడ కూడా ట్యాక్సెబుల్ ఇన్‌కం 50 లక్షలు దాటకూడదు. వ్యాపారంలో టర్నోవర్‌పై  నిర్ధిష్టమైన పర్సెంటేజ్ లెక్కించి వేయాలి. ఫారమ్ 1 అయినా లేదా ఫారమ్ 4 అయినా...ఫైల్ చేసేముందు..అన్ని కాగితాలు , సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రీ ఫిల్డ్ రిటర్న్ కాబట్టి మీ సమాచారం కన్పిస్తుంటుంది. అందులో ఏమైనా తేడాలుంటే మార్పులు చేయవచ్చు. ఫైలింగ్ ప్రాసెస్ పూర్తయిన తరువాత..ఈ వెరిఫై తప్పనిసరిగా చేయాలి. 

Also read: Cash Transactions: నగదు లావాదేవీలపై కొత్త పరిమితులు, దాటితే...ఫైన్ తప్పదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News