Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి

Income tax Slabs: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి వచ్చిన అప్‌డేట్ ఇది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. ఇందులో న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉన్నాయి. ఈ రెండింటి తేడా ఏంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2023, 05:23 PM IST
Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి

దేశంలో ట్యాక్స్ వసూలు చేసేది వివిధ రకాల సంక్షేమ పథకాల అమలు కోసమే. ఆదాయంపై ట్యాక్స్ ద్వారా దేశ ప్రగతి, అభివృద్ధి సాధ్యమౌతోంది. ఈ క్రమంలో మీరు కూడా ట్యాక్స్ పేయర్ అయితే..మీరు ఏ ట్యాక్స్ రెజిమ్‌లో ఉన్నారో తెలుసుకోండి.

మీ ఆదాయం ట్యాక్సెబుల్ అయితే..ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాక్సెబుల్ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించకపోతే చర్యలు తప్పవు. త్వరలోనే అంటే ఫిబ్రవరిలో దేశ బడ్జెట్ ప్రవేశపెట్టబడనుంది. కొత్త బడ్జెట్ కంటే ముందే ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం మంచిది. దేశంలో ఓల్డ్, న్యూ ట్యాక్స్ రెజిమ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకుంటే..ప్రత్యేక ఆదాయంపై ట్యాక్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకుంటే ప్రత్యేక ఆదాయంపై ట్యాక్స్ చెల్లింపబడుతుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌లో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

ఇన్‌కంటాక్స్ స్లాబ్

ఒకవేళ ఎవరైనా న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ దాఖలు చేస్తుంటే ట్యాక్స్ ఎంతనే వివరాలున్నాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరాన్ని పరిశీలిస్తే న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో ఏడాదికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 

అదే ఏడాది ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువగా 7.5 లక్షల వరకూ ఉంటే 10 శాతం ట్యాక్స్ ఉంటుంది. అదే 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఆదాయం ఉంటే..న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 15 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 

Also read: Flying Bike: ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్, ఎగిరే బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం, ధర, ఫీచర్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News