Flying Bike: ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్, ఎగిరే బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం, ధర, ఫీచర్లు ఇలా

Flying Bike: ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్ సిద్ధమైంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికా జెట్ ప్యాక్ ఏవియేషన్ కంపెనీ ఈ వినూత్నమైన బైక్ రూపొందించింది. మరో 2-3 ఏళ్లలో మార్కెట్‌లో కన్పించనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2023, 04:48 PM IST
Flying Bike: ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్, ఎగిరే బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం, ధర, ఫీచర్లు ఇలా

హాయిగా గాలిలో ఎగురుతూ పోతుంటే చాలా బాగుంటుంది కదూ. ఇప్పుడిది ఎంతో దూరంలో లేదు. త్వరలో బైక్‌పై ఎగురుతూ పోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..ముమ్మాటికీ నిజం. ఇక బైక్‌పై ఎగరవచ్చు. కేవలం 2-3 ఏళ్లలో మార్కెట్లో ఈ ఫ్లైయింగ్ బైక్ కన్పించనుంది. 

ఫ్లైయింగ్ బైక్ అనేది ఇప్పుడు కల కాదు. వాస్తవం. చాలామంది ఒకానొక సమయంలో కార్లు, బైక్‌లు ఎగురుతూ వెళ్తుంటే ఎలా ఉంటుందని ఆలోచించేవారు. ఇప్పుడు అమెరికా కంపెనీ ఈ ఆలోచనను నిజం చేసింది. ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ వినూత్నమైన బైక్ పేరు స్పీడర్. ప్రారంభ ధర 3.15 కోట్ల రూపాయలు. రానున్న 2-3 ఏళ్లలో మార్కెట్‌లో లాంచ్ కానుంది. 

గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ఈ బైక్ గాలిలో దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. స్పీడర్ ఫ్లైయింగ్ బైక్ ఒకేసారి గాలిలో 30-40 నిమిషాలు ఎగురగలదు. మెడికల్ ఎమర్జెన్సీ, మంటలు ఆర్పడం, ఆర్మీ రంగాల్లో ఉపయోగపడుతుంది. ఈ బైక్‌ను సామాన్యులు కూడా నడపగలరు. రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. 136 కిలోల బరువుండే ఈ బైక్..272 కిలోల బరువు మోయగలదు. అమెరికాకు చెందిన జెట్ ప్యాక్ కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ కంపెననీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తోంది. స్పీడర్‌లో 8 టర్బైన్స్ వినియోగించారు. 

జపాన్ కంపెనీ ద్వారా మరో ఫ్లైయింగ్ బైక్

గత ఏడాది జపాన్‌కు చెందిన కంపెనీ AERQINS కూడా అమెరికా డెట్రాయిట్ ఆటో షోలో ఫ్లైయింగ్ బైక్‌ను ప్రదర్శించింది. ఈ బైక్ గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. AERQINS అనేది అమెరికాకు చెందిన హోవర్ బైక్‌తో కలిసి ఈ బైక్ లాంచ్ చేయనుంది. 300 కిలోల బరువున్న ఈ బైక్ 100 కిలోల బరువు మోయగలదు. 

Also read: Helicopters Collided: హెలీక్యాప్టర్లు ఢీకొని నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News