Aadhaar Card Update: పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు పనిచేయవా, యూఐడీఏఐ ఏం చెబుతోంది, ఏం చేయాలి

Aadhaar Card Update: ఆధార్ కార్డు. దేశంలో ప్రతి పనికి అవసరమైంది. అన్నింటికీ ఆధారమైంది కాబట్టే ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయించుకోవాలి. గత కొద్దిరోజులుగా ఆధార్ కార్డు విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఏది నిజం ఏది కాదనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2024, 01:41 PM IST
Aadhaar Card Update: పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు పనిచేయవా, యూఐడీఏఐ ఏం చెబుతోంది, ఏం చేయాలి

Aadhaar Card Update: ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధిత పనులు, అడ్మిషన్లు, కేవైసీ, బ్యాంక్ ఎక్కౌంట్, సిమ్ కార్డు ఇలా ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. ఆఖరికి కొన్ని సంస్థల్లో ఉద్యోగాలకు కూడా ఆధార్ తప్పనిసరి అంటున్నారు. ఆధార్ కార్డు తీసుకోవడమే కాదు మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ కూడా ఇదే చెబుతోంది. 

ఆధార్ కార్డు విషయంలో గత కొద్దినెలలుగా ఓ అంశం బాగా వైరల్ అవుతోంది. పదేళ్లుగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోకుంటే ఆ కార్డు పనిచేయదనేది వైరల్ అవుతున్న అంశం. ఈ విషయం ఆధార్ కార్డు హోల్డర్లను బాగా ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి ఇది నిజం కాదు. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లయి ఉండి, ఈ పదేళ్లలో అప్‌డేట్ చేయకపోయినా ఆ కార్డు పనిచేస్తుంది. యూఐడీఏఐ సూచనల ప్రకారం ఆధార్ కార్డును ముఖ్యంగా పదేళ్ల క్రితం తీసుకున్న కార్డుల్ని అప్‌డేట్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు వివరాల్ని ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు మాత్రమే యూఐడీఏఐ జూన్ 14 వరకూ గడువు విధించింది. ఆ తరువాత కూడా ఆధార్ కార్డు పనిచేస్తుంది. వివరాలు అప్‌డేట్ చేయవచ్చు. జూన్ 14 తరువాత ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలంటే కనీస రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంట్లో కూర్చుని ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం ఎలా

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in ఓపెన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇప్పుడు అప్‌డేట్ ఆధార్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆధార్ కార్డులో మీ మెయిల్ ఐడీ, చిరునామా, పేరులో తప్పులు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాల్ని అప్‌డేట్ చేయాలి. పుట్టిన తేదీ, చిరునామా, పేరులో మార్పులకు మాత్రం తగిన ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చివరిగా సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు 14 అంకెల రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ సహాయంతో మీ ఆధార్ అప్‌డేట్ ట్రాక్ చేయవచ్చు.

Also read: iPhone 16 Features: లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు, కెమేరా ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News