Isabgol For High Cholesterol: కొలెస్ట్రాల్ సమస్యల నుంచి సకాలంలో ఉపశమనం పొందలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలికి అవాటు పడడం, అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడం వల్ల చాలా మంది సిరల్లో LDL పేరుకుపోతోంది. దీంతో వారిలో మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే మీరు ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తీసుకునే ఆహారాల్లో ఇసాబ్‌గోల్‌ను తప్పని సరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఇసాబ్‌గోల్ ప్రభావవంతంగా సహాయపడుతుందా?:
ఇసాబ్‌గోల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయని ఇటీవలే పరిశోధనల్లో రుజువైంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో ఇసాబ్‌గోల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇసాబ్‌గోల్‌ను ఎలా తీసుకోవాలి:
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఇసాబ్‌గోల్‌ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని..అందులో ఒక చెంచా ఇసాబ్‌గోల్ కలపాలి. ఇలా కలిపిన నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
ఈ విషయాలపై శ్రద్ధ వహించండి:
కొంతమందికి ఇసాబ్‌గోల్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపులో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యల బారిన పడతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇసబ్‌గోల్ ప్రయోజనాలు:
ఇసాబ్‌గోల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. అంతేకాకుండా బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రిణలో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా మారుతుంది. అయితే ఈ ఇసబ్‌గోల్ మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో దీనిని వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్ సినిమా క్యాస్టింగ్ ఇదే
Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook