Bike Discount: ఈ బైక్‌పై ఏకంగా రూ. 1.25 లక్షల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే!

Kawasaki W800 will get Rs 125000 discount offer till 2022 December 31. భారతదేశంలోని కస్టమర్లను ఆకర్షించడానికి 'కవాసకి' ఇండియా అద్భుత ఆఫర్లను తీసుకొచ్చింది. కవాసకి తన రెండు బైక్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 26, 2022, 01:32 PM IST
  • ఈ బైక్‌పై ఏకంగా రూ. 1.25 లక్షల తగ్గింపు
  • ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే
  • భారతదేశంలో రూ. 7.32 లక్షల ప్రారంభ ధర
Bike Discount: ఈ బైక్‌పై ఏకంగా రూ. 1.25 లక్షల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే!

Rs 125000 discount offer on Kawasaki W800 till 2022 December 31: మరో ఐదు రోజుల్లో 2022 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని కస్టమర్లను ఆకర్షించడానికి 'కవాసకి' ఇండియా అద్భుత ఆఫర్లను తీసుకొచ్చింది. కవాసకి తన రెండు బైక్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మిడిల్ వెయిట్ మోటార్‌ బైక్స్ Z650 మరియు W800 కోసం 'గుడ్ టైమ్స్ వోచర్‌లను' ప్రకటించింది. కవాసకి జెడ్650 బైక్‌పై రూ. 35,000 వోచర్‌ ఉండగా.. కవాసకి డబ్ల్యూ800 బైక్‌పై రూ. 1,25,000 వోచర్‌ అందుబాటులో ఉంది. ఈ వోచర్ల ద్వారా కస్టమర్లు ఎక్స్-షోరూమ్ ధరలపై తగ్గింపులను పొందవచ్చు. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2022 వరకు మాత్రమే ఉంది. 

కవాసకి W800 (Kawasaki W800) ఒక క్రూయిజర్ బైక్. ఈ బైక్ భారతదేశంలో రూ. 7.32 లక్షల ప్రారంభ ధరతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 773సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఇది 50.95 బిహెచ్‌పి పవర్ మరియు 62.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లతో కూడిన యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఈ బైక్ బరువు 224 కిలోలు కాగా.. 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.

కవాసకి W800 డిజైన్ బాగుంటుంది. ఇది రెట్రో స్టైలింగ్‌లో వస్తుంది. గుండ్రని హెడ్‌లైట్లు, వైర్-స్పోక్ వీల్స్ మరియు అనేక భాగాలపై క్రోమ్‌ వస్తుంబ్ది. LED హెడ్‌లైట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అసిస్ట్ కూడా ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ మెకానిజం వంటి ఫీచర్లు కూడా ఈ బైక్‌లో ఉంటాయి.

కవాసకి W800 బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున ట్విన్-సైడ్ స్ప్రింగ్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సెటప్‌లో రెండు చక్రాల వద్ద సింగిల్ డిస్క్ ఉంటుంది. ఈ బైక్ కేవలం ఒక రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్లో ఈ బైక్.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650తో పోటీపడుతుంది.

Also Read: Mars Tarnsit 2023: జనవరి 13న కుజ ప్రత్యక్ష సంచారం.. ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం!

Also Read: Neha Sharma Bikini Photos: గోవా బీచ్లో నేహా శర్మ బికినీ ట్రీట్.. మందారంలో మెరిసిపోతోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News