Kia Seltos Price Cut: సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ధర తగ్గించిన కియా, ఇప్పుడెంతంటే

Kia Seltos Price Cut: దేశంలోని కారు మార్కెట్‌లో కియా మోటార్స్ వాటా అంతకంతకూ పెరుగుతోంది. ఆ కంపెనీ కార్లకు క్రేజ్ ఉండటంతో మార్కెట్‌లో నిలబడుతోంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కు సంబంంధించి ఆ కంపెనీ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2023, 08:30 AM IST
Kia Seltos Price Cut: సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ధర తగ్గించిన కియా, ఇప్పుడెంతంటే

Kia Seltos Price Cut: కియా మోటార్స్ కార్లలో కియా సెల్టోస్‌కు మంచి ఆదరణ ఉంది. అద్భుతమైన సౌకర్యవంతమైన ఎస్‌యూవీ. కియా సెల్టోస్‌ను ఇటీవల కొత్తగా అప్‌గ్రేడ్ చేసి కొత్త ఫీచర్లు, కొత్త ఇంజన్ ఆప్షన్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌గా ప్రవేశపెట్టింది. ఇప్పుడీ కారు ధరను కంపెనీ కొద్దిగా తగ్గించింది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర, ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా కొన్ని ఫీచర్లు జోడించింది కంపెనీ. ఈ కారు ప్రారంభ ధర 10.90 లక్షల్నించి ప్రారంభమై 20.30 లక్షల వరకూ ఉంటుంది. సెల్టోస్ కొన్ని వేరియంట్ల ధరను 2000 రూపాయలు తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కొన్ని వేరియంట్లలో ఒక ఫీచర్ తొలగించడంతో ఈ తగ్గింపు సాద్యమైనట్టుగా తెలుస్తోంది. కియా 1.5 పెట్రోల్ ఎంటీ హెచ్టీఎక్స్, 1.5 టర్బో పెట్రోల్ ఐఎంటీ హెచ్‌టీఎక్స్ ప్లస్, 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ జీటీఎక్స్ ప్లస్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ జీటీఎక్స్ ప్లస్ ఎస్, 1.5 లీటర్ డీజిల్ ఐఎంటీ హెచ్‌టీఎక్స్ ప్లస్, 1.5 లీటర్ డీజిల్ ఏటీ జీటీఎక్స్ ప్లస్ ధరల్ని 2000 రూపాయలు తగ్గిస్తున్నట్టుగా కియా మోటార్స్ ప్రకటించింది. ఈ వేరియంట్లలో నాలుగు పవర్ విండోల్నించి వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ తొలగించింది.

మిగిలిన వేరియంట్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు, అన్ని ఫీచర్లు అలానే ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఫీచర్ హెచ్‌టీఎక్స్ ప్లస్ ట్రిమ్ తరువాత అన్ని వేరియంట్లలో ఉండేది. ఇప్పుడు సెల్టోస్ మార్పు తరువాత కేవలం టాప్ స్పేక్ ఎక్స్‌లైన్ ట్రిమ్‌లో నాలుగు విండోలకు వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ కొసాగించింది. ఇతర వేరియంట్లలో కేవలం డ్రైవర్ సీటు విండోకు మాత్రమే వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ ఉంటుంది.

కియా సెల్టోస్‌లో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇందులో 6 స్పీడ్ ఐఎంటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ ఆటోమేటిక్, 5 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also read: FD Interest Rate: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9 శాతం వరకూ వడ్డీ, ఈ 5 బ్యాంకుల వివరాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News