Mahindra Xuv700 Price Dropped: ప్రముఖ దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా గుడ్ న్యూస్ తెలిపిది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన టాప్ ఎక్స్‌యూవీ 700 (XUV700 AX7)వేరియంట్‌పై ధరను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్ ప్రారంభ అసలు ధర రూ.21 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా.. జూలై 9వ తేది నుంచి రూ. 19.49 లక్షల నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఎక్స్‌యూవీ 700 వేరియంట్ ధరలో వచ్చిన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ కారుకు ఇప్పటికే మంచి ప్రజాదరణ లభించింది. అయితే ధరలు తగ్గడంతో మార్కెట్‌లో దీని సేల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం, ఎక్స్‌యూవీ 700 (XUV700) కారుకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టలో పెట్టుకుని, తమ కస్టమర్స్ కోసం ధర తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కొత్త ధర మహీంద్రా కంపెనీ వార్షికోత్సవం వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని బట్టి చూస్తే ఈ తగ్గిన ధరలు దాదాపు నాలుగు నెలల పాటు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తగ్గిన ధరలు ఇటీవలే విడుదలైనా XUV700లో డీప్ ఫారెస్ట్‌తో పాటు బర్న్ట్ సియెన్నా అనే రెండు కలర్ ఆప్షన్స్‌పై మాత్రమే అందుబాటులో ఉంచిన్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్ SUV మొత్తం 9 కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
మహీంద్రా XUV700 ధరలు:
మహీంద్రా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ధరలు నాలుగు నెలల పరిమిత కాలని మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత కంపెనీపై ధరలు అధారపడి ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక ఈ కార్ల ధర వివరాల్లోకి వెళితే, సిక్స్ సీటర్ XUV700 AX7 MT పెట్రోల్ వేరియంట్ ధర రూ.19.69 లక్షల కంటే అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఇక ఇందులోనే డిజిల్ వేరియంట్ రూ.20.19 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర 21.19 లక్షలు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఇందులో డీజిల్ వేరియంట్ కేవలం రూ.21.59 లక్షల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ధర జూలై 09వ తేది నుంచి అన్ని మహీంద్రా షోరూమ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.
మహీంద్రా XUV700 టాప్ 10 ఫీచర్లు:
అడ్రినోX టెక్నాలజీ పవర్‌ఫుల్ ఇంజన్
2.0L టర్బో పెట్రోల్ ఇంజన్
2.2L డీజిల్ ఇంజన్
6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అడప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
లేన్ డిపార్చర్ వార్నింగ్
ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
బ్లైండ్ స్పాట్ డిటెక్షన్
25-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి వైర్‌లెస్ కనెక్టివిటీ
పనోరమిక్ సన్‌రూఫ్
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్
డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
360-డిగ్రీ కెమెరా
ఏయిర్ ప్యూరిఫైయర్
అలయింగ్ డోర్ హ్యాండిల్స్
సోనీ-పవర్డ్ స్పీకర్‌లతో కూడిన 3D ఆడియో
లెథెరెట్ సీట్లు
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి