Maruti Suzuki crosses 25 million domestic sales in India: భారతదేశపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ 'మారుతీ సుజుకి' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలమైన పోర్ట్‌ఫోలియో మరియు కస్టమర్ డిమాండ్‌ను అర్థం చేసుకున్న మారుతి సుజుకి.. ఇతర కంపెనీలకు సాధ్యం కాని వాహన విక్రయాల రికార్డును సృష్టించింది. 2023 జనవరి 9న భారత మార్కెట్‌లో మారుతి కంపెనీ మొత్తం అమ్మకాలు 25 మిలియన్లు. 25 మిలియన్ కార్ యూనిట్లను దాటామని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
1982 సంవత్సరంలో జపాన్ ఆటోమేకర్ సుజుకి మారుతి ఉద్యోగ్‌తో ఒప్పందం కుదుర్చుకుని.. మారుతి సుజుకిని ప్రారంభించింది. డిసెంబర్ 1983లో కంపెనీ తన మొదటి కారు 'మారుతి 800'ని భారతదేశంలో విడుదల చేసింది. అప్పటి నుంచి మారుతి సుజుకి సంస్థ వెనుదిరిగి చూసుకోలేదు. మారుతి సుజుకి తన భారతీయ కస్టమర్ల కోసం ఆల్టో, వ్యాగన్ఆర్ మరియు స్విఫ్ట్ వంటి ప్రసిద్ధ మోడళ్లను విడుదల చేసింది. ఈ కార్లు దాదాపుగా 30 సంవత్సరాలుగా అమ్ముడవుతున్నాయి.
మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో 17 కార్లను కలిగి ఉంది. వీటన్నింటిని భారతదేశంలో తయారు చేసి విక్రయిస్తోంది. మారుతి సుజుకి ఇటీవల పెరుగుతున్న SUV మోడల్‌లో తన పోర్ట్‌ఫోలియోను ఏకీకృతం చేస్తోంది. హైబ్రిడ్ మరియు సిఎన్‌జి మోడళ్లను పాపులర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హైబ్రిడ్ మరియు సిఎన్‌జి మోడల్‌ల సంయుక్త విక్రయాలు దాదాపు 2.1 మిలియన్ యూనిట్లు. కంపెనీ తన నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది. మారుతీ సుజుకి దేశంలో 3,500 కంటే ఎక్కువ కార్ల విక్రయ కేంద్రాలను కలిగి ఉంది.
మారుతి సుజుకి రికార్డు:
డిసెంబర్ 1983లో మొదటి కారు మారుతీ 800 విడుదలైంది
ఫిబ్రవరి 2006లో 5 మిలియన్ల అమ్మకాలు జరిగాయి
ఆగస్టు 2010లో సిఎన్‌జి మోడళ్లను విక్రయించడం ప్రారంభించింది
ఫిబ్రవరి 2012లో 10 మిలియన్ల విక్రయాల రికార్డు
సెప్టెంబర్ 2015లో హైబ్రిడ్ మోడళ్ల విక్రయాలను ప్రారంభించింది
జూలై 2019లో 20 మిలియన్ల అమ్మకాలను సాధించింది
ఫిబ్రవరి 2022లో సిఎన్‌జి మోడల్‌ల 1 మిలియన్ విక్రయాలను సాధించింది
జనవరి 2023లో 25 మిలియన్ల విక్రయాల రికార్డు
Also Read: పరుగులు చేయడమే అతడికి తెలుసు.. సెలెక్షన్ గురించి అస్సలు పట్టించుకోడు! అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.