Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ వచ్చేసింది.. మహింద్రా థార్ కంటే తక్కువ ధరలో..

Maruti Suzuki Jimny Prices In India: ఈ ఏడాది ఆరంభంలో గ్రేటర్ నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023 లో మారుతి సుజుకి జిమ్నీని ఇండియాలో తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మారుతి సుజుకి జిమ్నీ ఎప్పటికప్పుడు న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేల బుకింగ్స్ కూడా వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2023, 04:12 PM IST
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ వచ్చేసింది.. మహింద్రా థార్ కంటే తక్కువ ధరలో..

Maruti Suzuki Jimny Prices In India: మారుతి సుజుకి జిమ్నీ ఇండియాలో లాంచ్ అయింది. జెటా, ఆల్ఫా అని రెండు వేరియంట్స్‌లో లాంచ్ అయిన ఈ 5 డోర్ కారు.. బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.12. 7 లక్షలు కాగా టాప్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 15.05 లక్షలుగా ఉంది. నెక్సా షూరూమ్స్‌లో అన్ని కార్ల తరహాలోనే ఈ కారును కూడా రూ. 11,000 లకే బుక్ చేసుకోవచ్చు అని మారుతి సుజుకి స్పష్టంచేసింది. 

మారుతి సుజుకి జిమ్నీ ఇంజన్ ఫీచర్స్ విషయానికొస్తే... 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు 103 హార్స్ పవర్‌ని, 134 Nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ కారు ఎంచుకునే కస్టమర్స్‌కి బేసిక్ వేరియంట్, టాప్ వేరియంట్‌తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి 5 స్పీడ్ మాన్వల్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ కాగా.. మరొకటి 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ ఉంది. 

ఈ ఏడాది ఆరంభంలో గ్రేటర్ నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023 లో మారుతి సుజుకి జిమ్నీని ఇండియాలో తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మారుతి సుజుకి జిమ్నీ ఎప్పటికప్పుడు న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేల బుకింగ్స్ కూడా వచ్చాయి. గురుగావ్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో మారుతి సుజుకి జిమ్నీ తయారవుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మారుతి సుజుకి జిమ్నీ విక్రయాలు జరుగుతుండగా.. అవన్నీ కూడా 3 డోర్ ఫార్మాట్ లో రూపొందించిన కార్లు మాత్రమే. అయితే తొలిసారిగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో 5 డోర్ ఫార్మాట్లో ఈ కారు లాంచ్ అయింది. 

ఈ కారు లాంచింగ్‌తోనే మరో విశిష్టతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 4X4 SUV కారు ఫార్మాట్లో తక్కువ ధరలో లాంచ్ అయిన కారు మహీంద్రా థార్ మాత్రమే కాగా.. ఆ లో ప్రైస్ ట్యాగ్‌ని తాజాగా మారుతి సుజుకి జిమ్నీ కొట్టేసింది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్స్, వైర్లెస్ యాపిల్‌కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Jimny, Citroen C3 Aircross: జూన్‌లో రోడ్లపై గత్తెరలేపనున్న కార్లు.. లాంచ్ కి రెడీగా ఉన్నవి ఇవే! ఓ లుక్కేయండి

ప్యాసింజర్స్ సేఫ్టీ విషయానికొస్తే.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు అనుగుణంగా మారుతి సుజుకి జిమ్నీలో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్, వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం 3 పాయింట్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా కొత్తగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, అన్ని చక్రాలకు డిస్కు బ్రేకులు వంటి అధునాతన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో.. మరీ ముఖ్యంగా ఎండాకాలం టైర్లు పేలుతున్న ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తోన్న తరుణంలో ఈ మారుతి సుజుకి జిమ్నీ వాహనంలో అందుబాటులో ఉన్న టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం అలాంటి ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి : CIBIL Score Without Loans: అసలు క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా ?

ఇది కూడా చదవండి : Car Buying Tips: కారు కొనేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News