Car Buying Tips: కారు కొనేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

Things To Check While Buying Cars: కొత్త కారు కొనేటప్పుడు కస్టమర్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి కారు కొనాలి, ఏ కారు కొనాలి అనే విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, వాళ్ల సలహాలు, వీళ్ల సలహాలు తీసుకున్న తరువాత కూడా మైండ్‌లో ఇంకేదో రన్ అవుతుంటుంది. అదేంటంటే.. 

Written by - Pavan | Last Updated : May 25, 2023, 05:09 PM IST
Car Buying Tips: కారు కొనేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

Things To Check While Buying Cars: కొత్త కారు కొనేటప్పుడు కస్టమర్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి కారు కొనాలి, ఏ కారు కొనాలి అనే విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, వాళ్ల సలహాలు, వీళ్ల సలహాలు తీసుకున్న తరువాత కూడా మైండ్‌లో ఇంకేదో రన్ అవుతుంటుంది. అదేంటంటే.. మనం తీసుకున్న నిర్ణయం సరైనదేనా ? లేక కారు సెలెక్షన్ లో తెలియక ఏమైనా పొరపాటు చేస్తున్నామా అనే టెన్షన్ చాలామందిని వెంటాడుతుంటుంది. అయితే, కారు కొనడానికంటే ముందుగా ఎలాంటి కారును ఎంచుకోవాలి, ఆ కారు ఎలా ఉండాలి అనే విషయంలో కొన్ని వివరాలు తెలిస్తే.. కారు కొనేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా కొత్త కారును కొంటున్నాం అనే ఫీలింగ్ ని ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది.

కారు కొనడానికి కారణం ఏంటి
అసలు కారు కొనడానికి వెనుకున్న కారణం ఏంటి అనేది ముందుగా ఆలోచించుకోవాలి. పక్కింటి వాళ్లు కొంటున్నారనో లేక ఎదురింటి వాళ్లకు కారు ఉందనో కాకుండా.. ఇంట్లో అవసరాల కోసం కొంటున్నామా, అవి ఎలాంటి అవసరాలు అనేది ఆలోచించుకోవాలి. 

కుటుంబసభ్యుల సంఖ్య
ఇంట్లో ఉండే కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి కారు కొన్నట్టయితే.. కుటుంబం మొత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు మరో వాహనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎప్పుడో కానీ అందరం కలిసి బయటికి వెళ్లే పని ఉండదు కనుక చిన్న కారు అయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు చిన్న కారునే సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. 

బడ్జెట్ ఎంత ? 
కారు కొనడం కోసం ఎంత బడ్జెట్ ఉంది ? ఆ కారు కొన్న తరువాత అయ్యే రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు ఎంత అవుతుంది ? అనే లెక్కలపై ముందుగానే స్పష్టత ఉండాలి. లేదంటే బడ్జెట్ కి మించి కారును కొంటే.. ఆ తరువాత కారును ఉపయోగించడంలో ఆనందాన్ని ఆస్వాదించలేం అనే విషయాన్ని మర్చిపోవద్దు.

ఏ బ్రాండ్ కారును కొనాలనుకుంటున్నారు.. ఆ బ్రాండులో మీ బడ్జెట్ లో లభించే కారు మోడల్స్, వేరియంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ బ్రాండ్ కి చెందిన సర్వీస్ సెంటర్స్ మీరు ఉండే ఏరియాలో ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకోవాలి. లేదంటే సర్వీసింగ్ చేయించిన ప్రతీసారి దూరం వెళ్లాల్సి రావడమే కాకుండా.. కొన్నిసార్లు కారు అత్యవసరంలో అందుబాటులో లేక ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది.

కారు లోన్ వడ్డీ రేటు
బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని కారు కొన్నట్టయితే.. ఏదో ఒక బ్యాంకులో లోన్ తీసుకుని ఆ తరువాత ఐదారేళ్లపాటు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించకుండా.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంది ? ఎందులో తక్కువ ఈఎంఐ చార్జ్ అవుతుంది అనే వివరాలు తెలుసుకుని సరిపోల్చుకుని చూసుకోవాలి.  

టెస్ట్ డ్రైవ్ చేయండి
కారును కొనడానికి ముందుగా కచ్చితంగా చేయాల్సిన కొన్ని పనుల్లో కారు టెస్ట్ డ్రైవింగ్ అతి ముఖ్యమైనది. ఎవరో చెప్పారనో లేక ఎక్కడో చూశామనో కాకుండా.. ఆ కారును ముందుగా టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే ఆ కారు మీ పర్సనాలిటీకి సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. మీ హైట్ అండ్ పర్సనాలిటీకి తగినట్టుగా కంఫర్టుగా ఉంటుందా లేదా అనేది టెస్ట్ డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది.

ఆన్‌లైన్లో అడ్వర్టైజ్‌మెంట్ చూసి కారును కొనకుండా.. నేరుగా డీలర్ వద్దకు వెళ్లి ఆ కారు డిజైన్, లుక్, ఫీచర్స్, పరిశీలించి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశాకే కారు కొనడం అనేది ఉత్తమం.

ఇది కూడా చదవండి : Maruti Jimny Bookings Crossed 30000: మారుతి సుజుకి జిమ్ని కోసం ఎగబడుతున్న జనం

కారు కొనేముందు ఏ బ్రాండ్ వాళ్లు ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో ఒకసారి కంపేర్ చేసి చూడండి. మీకు నచ్చిన కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో చూడండి. ఆఫర్స్ గురించి తెలుసుకోకుండా పొరపాటున ఎక్కువ ధర పెట్టి కొని కారుని కొనకుండా బెస్ట్ ప్రైస్ గురించి ఆరా తీశాకే కొనండి. అప్పుడు మీకు కొంత ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కారును కొన్నాకా.. అదే కారును మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా అంతకంటే తక్కువ ధరలో కొన్నట్టయితే.. అప్పుడు మీకు డిజప్పాయింట్ అవడం వల్ల కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. కారును కొనేటప్పుడే ఆ కారు ఫ్యూచర్ మెయింటెనెన్స్, సర్వీసింగ్, ఇతర గ్యారెంటీ, వారంటీలు వంటి అంశాల విషయంలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని సరిగ్గా చూసి కొనుగోలు చేయండి.

ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇది కూడా చదవండి : Tata Altroz CNG Car: అద్దిరిపోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు

ఇది కూడా చదవండి : Hyundai Exter Launch: హ్యుందాయ్ ఎక్స్‌టర్ వచ్చేస్తుంది.. 11 వేలకు బుకింగ్! ఇక టాటా పంచ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

More Stories

Trending News