Maruti Suzuki: చడీచప్పుడు లేకుండా మారుతి కొత్త మోడల్ లాంచ్, ధర కేవలం 4.8 లక్షలే, మైలేజ్ ఏకంగా 34 కిలోమీటర్లు

Maruti Suzuki: దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ మారుతి సుజుకి మరో కొత్త కారుని మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది మారుతి సుజుకి. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన కారు వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2023, 04:00 PM IST
Maruti Suzuki: చడీచప్పుడు లేకుండా మారుతి కొత్త మోడల్ లాంచ్, ధర కేవలం 4.8 లక్షలే, మైలేజ్ ఏకంగా 34 కిలోమీటర్లు

Maruti Suzuki: మారుతి సుజుకి దేశంలోనే దిగ్గజ కారు కంపెనీ. ప్రతియేటా అత్యధిక విక్రయాలు జరిపే టాప్ 1 కార్లలో మారుతి సుజుకి ముందుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌తో మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తుంటుంది. ఇటీవలే రెండు మోడల్స్ లాంచ్ చేసిన కారు మరో మోడల్ ఆవిష్కరించింది.

మారుతి సుజుకి అంటే దేశప్రజలకు చాలా మక్కువ. మెయింటెనెన్స్ తక్కువ, రీసేల్ విలువ అధికంగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు, మైలేజ్ అందించే మేడ్ ఇన్ ఇండియా కారు ఇది. ఎప్పటి కప్పుడు కొత్త మోడళ్లు ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే మారుతి సుజుకి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు లాంచ్ చేసింది. ఇటీవలే మారుతి ఆల్టో 800 క్లోజ్ చేసిన కంపెనీ..చడీచప్పుడు లేకుండా కొత్త ఆల్టో ఇండియాలో లాంచ్ చేసేసింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ధర చాలా తక్కువ, మైలేజ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా లీటర్‌కు 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంత ఎక్కువ మైలేజ్ బహుశా ఏ కారు ఇవ్వకపోవచ్చు. మారుతి సుజుకి కంపెనీ ఆల్టో 800 క్లోజ్ చేసిన తరువాత ఆ స్థానంలో ఆల్టో కే10ను Tour H1 పేరుతో రీలాంచ్ చేసింది. ఈ కారు కమర్షియల్‌గా ఉపయోగించే ఉద్దేశ్యంతో లాంచ్ చేసింది కంపెనీ. 

మారుతి సుజుకి Tour H1 ఇంజన్, మైలేజ్, ఇతర ప్రత్యేకతలు

ఈ కారులో 1.0 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ పెట్రోల్ ఇంజన్ ఉంది. పెట్రోల్ ఆధారంగా 5,500 ఆర్పీఎంలో 65 బీహెచ్‌పి, సీఎన్జీతో 5,300 ఆర్పీఎం, 56 బీహెచ్‌పి ఇస్తుంది. ఇక 3,500 ఆర్పీఎం పై 89 ఎన్ఎం సీఎన్జీ మోడ్‌‌లో 3,400 ఆర్పీఎం ఇస్తకుంది. పెట్రోల్ వెర్షన్‌లో లీటర్‌కు 24.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే..సీఎన్జీ వెర్షన్ లీటర్‌కు 34.46 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 

ఇక ఇతర సౌకర్యాల విషయాన్ని పరిశీలిస్తకే డ్యూయల్ ఎయిర్ బ్యాక్, ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో పాటు ఫ్రంట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజన్ ఇమ్మోబిలైజర్, ఈబీడీ విత్ ఏబీఎస్ టెక్నాలజీ, స్పీడ్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ కారు మూడు మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి Tour H1

ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్జీ కిట్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి Tour H1 పెట్రోల్ వేరియంట్ ధర 4.80 లక్షల రూపాయలు కాగా, సీఎన్జీ వెర్షన్ ధర 5.70 లక్షల రూపాయలుంటుంది. మారుతి సుజుకి టూర్ హెచ్ 1 అనేది ఆల్టో కే10కు ప్రత్యామ్నాయం. ఇందులో ఆల్టో కే10 లో ఉన్నట్టే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఉంటుంది. 

Also read: Jio Fiber P‌lans: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, సోనిలివ్ ఓటీటీలు ఉచితం జియో ఫైబర్‌లో ఈ ప్లాన్స్ తీసుకుంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News